హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరచాలనం, ఏకాంత భేటీ: అప్పగింతపై మళ్లీ చెప్తానని కేసీఆర్‌కు బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు మరోసారి కలిశారు. ఇరువురు మాట్లాడుకున్నారు. కరచాలనం చేసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు మరోసారి కలిశారు. ఇరువురు మాట్లాడుకున్నారు. కరచాలనం చేసుకున్నారు. ఇరువురు సీఎంలు గవర్నర్ నరసింహన్‌తో ఏకాంతంగా పదిహేను నిమిషాలు మాట్లాడారు.

నగదు రహిత లావాదేవీల గురించి ఈ సందర్భంగా చర్చించారు. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం సబబేనని, తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాలికంగా సత్ఫలితాలు వస్తాయని ఇరువురు సీఎంలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీఎంనే ఆపుతావా.. ఇక నేనే, గుర్తు పెట్టుకొని తాట తీస్తా: పోలీసులకు జగన్ వార్నింగ్సీఎంనే ఆపుతావా.. ఇక నేనే, గుర్తు పెట్టుకొని తాట తీస్తా: పోలీసులకు జగన్ వార్నింగ్

పెద్దనోట్ల రద్దు అనంతరం ఏపీలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అప్రమత్తంగా వ్యవహరించామని, అలాగే నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తామని చంద్రబాబు అన్నారు. అలాగే సీఎెంల ప్యానెల్ చేసిన సూచనలకు మోడీ కితాబిచ్చారన్నారు.

క్యాష్ లెస్ విధానంపై కేంద్రం, ఇరు రాష్ట్రాలు సహకరించుకోవాలని సీఎంలు అభిప్రాయపడగా, గవర్నర్ అభినందించారు. సచివాలయ భవనాల అప్పగింతపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. తన తిరుపతి రాక గురించి ఇంకా అనుకోలేదని కేసీఆర్ చెప్పారు. విశాఖ సీఐఐ పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఓటుకు నోటు కేసు అనంతరం చంద్రబాబు - కేసీఆర్‌ల మధ్య విభేదాలు కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. అప్పటి నుంచి ఇరువురు సీఎంలు ఎప్పుడు కలిసినా చర్చనీయంగా మారుతుంది.

Chandrababu and KCR at home in Hyderabad

ఈ రోజు గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో ఎట్ హోం పేరుతో తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.

English summary
AP CM Chandrababu Naidu and Telangana CM KCR met at 'at home' in Hyderabad on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X