చంద్రబాబు నోట్ల రద్దుపై లేఖ రాశారు కానీ
నల్గొండ: పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బడాబాబులపై చర్యలు తీసుకుని నల్లధనం వెలికితీస్తేనే ప్రధాని నరేంద్ర మోదీకి క్రెడిట్ దక్కేదని చెప్పారు. తాను రాసిన లేఖ వల్లే కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లు రద్దు చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారని, ఆ లేఖలో ప్రత్యామ్నాయాలు కూడా రాసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications