ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో అపశృతి.. ఒకరు మృతి, 13 మందికి తీవ్రగాయాలు ?
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. హిందు సంస్థలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో కాషాయ జెండా ఎగురవేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనలో లింగ ప్రసాద్ అనే యువకుడు స్పాట్‌లోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన 13 మందిని స్థానికులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వీరిలోనూ ఒక యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్థానికుల సమాచారం మేరకు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టి మరింత ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టారు. అలానే గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్..
మరోవైపు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలు, పరిపాలన విధానాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని సీఎం కొనియాడారు.












Click it and Unblock the Notifications