స్వచ్ఛ భారత్ మిషన్ రెండో జాబితా: చార్మినార్‌కు అరుదైన గౌరవం
చార్మినార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ మిషన్ దేశవ్యాప్తంగా ఎంపికచేసిన రెండో దశ పది ఐకానిక్ ప్రాంతాల జాబితాలో చార్మినార్‌కు స్థానం లభించింది. ఇందులో భాగంగా చార్మినార్ ప్రాంతాన్ని స్వచ్ఛ
హైదరాబాద్: చార్మినార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ మిషన్ దేశవ్యాప్తంగా ఎంపికచేసిన రెండో దశ పది ఐకానిక్ ప్రాంతాల జాబితాలో చార్మినార్‌కు స్థానం లభించింది. ఇందులో భాగంగా చార్మినార్ ప్రాంతాన్ని స్వచ్ఛ మోడల్‌గా తీర్చిదిద్దుతారు.

చార్మినార్ అభివృద్ధికి
ఈ బాధ్యతను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎన్టీపీసీ సంస్థకు అప్పగించారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో మంగళవారం స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. చార్మినార్ అభివృద్ధికి ప్రత్యేక కార్యప్రణాళికను రూపొందించే అంశంపై చర్చించారు.

మొత్తం వంద నగరాలు
దేశంలోనే స్వచ్ఛతకు మారుపేరుగా చార్మినార్‌ను రూపొందించేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించటం, కాలపరిమితి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ జనరల్ అక్షయ్‌రౌత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం వంద నగరాలను స్వచ్ఛతకు మోడల్‌గా తీర్చిదిద్దాలని స్వచ్ఛభారత్ మిషన్ సంకల్పించింది.

కార్పోరేట్ సామాజిక బాధ్యత
మొదటి దశలో అమృత్‌సర్ సహా పది ప్రాంతాలను స్వచ్ఛ ఐకాన్‌గా గుర్తించారు. రెండో దశలో చార్మినార్ సహా పది ప్రాంతాలను గుర్తించారు. ఇలా గుర్తించిన ఐకానిక్ ప్రాంతాలను స్వచ్ఛతపరంగా సమగ్రంగా అభివృద్ధి చేస్తారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క ప్రభుత్వరంగ సంస్థకు అప్పగిస్తారు. ఆ సంస్థ ఆయా ఐకానిక్ ప్రాంతాల్లో చేపట్టాల్సిన స్వచ్ఛ కార్యక్రమాలపై స్థానిక యంత్రాంగంతో చర్చించి పనులు చేపట్టడానికి కావాల్సిన నిధులను అందజేస్తుంది.

చార్మినార్‌తో పాటు ఇవీ
కాగా, రెండో జాబితాలో చార్మినార్‌తోపాటు గంగోత్రి, యమునోత్రి, ఉజ్జయిని మహకాళేశ్వర్ దేవాలయం, గోవాలోని చర్చ్ అండ్ కాన్వెంట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఎస్సిస్సి, ఎర్నాకులంలోని ఆదిశంకరాచార్య కలాది, శ్రావణ బెలగొళలోని గోమటేశ్వర క్షేత్రం, దేవ్‌గఢ్‌లోని బైజ్‌నాథ్ ధామ్, బిహార్‌లోని గయాతీర్థ్, గుజరాత్‌లోని సోమనాథ్ మందిరం ఉన్నాయి.












Click it and Unblock the Notifications