పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్
Charminar express: చెన్నై- హైదరాబాద్ మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 50 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు.
Recommended Video

ఈ ఉదయం నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన సంభవించింది. చెన్నైలోని డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ స్టేషన్ నుంచి బయలుదేరిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఈ ఉదయం నాంపల్లికి చేరుకుంది. స్టేషన్‌లో ప్రవేశించినప్పుడు ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పింది. ప్లాట్ ఫామ్ నంబర్ 5 మీదికి వచ్చిన అనంతరం పట్టాలు తప్పింది. నేరుగా వెళ్లి ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టింది.

ఈ ఘటనలో సుమారు 50 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో నాంపల్లి స్టేషన్‌లో కలకలం చోటు చేసుకుంది. అంబులెన్సుల సైరన్ మోతలతో మారుమోగింది. ప్రయాణికులు, వారి బంధువుల రాకతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నాంపల్లి లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం..!!#CharminarExpress #NampallyRailwayStation #Oneindiatelugu pic.twitter.com/4BOEbvTbV3
— oneindiatelugu (@oneindiatelugu) January 10, 2024
ఈ సమాచారం అందిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదని, కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయాలయ్యాయని తెలిపారు. వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పట్టాలు తప్పడానికి గల కారణాలపై రైల్వే అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications