Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు..! ఫిబ్రవరి 3 నుంచి ఇలా..!

తెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే చార్మినార్ ఎక్స్ ప్రెస్ (charminar express)ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ అలర్ట్ జారీ చేసింది. ఈ రైలు ప్రయాణాల్లో ఓ కీలక మార్పు చేసింది. ఈ మార్పు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా ఈ మార్పు చేసినట్లు రైల్వే అధికారులు ఇవాళ ఎక్స్ లో ఓ ప్రకటన పోస్ట్ చేశారు. దీంతో చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే వారు ఈ మార్పును గమనించాల్సి ఉంటుంది.

వాస్తవానికి చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుంచి తమిళనాడులోని తాంబరం వరకూ ప్రయాణాలు సాగిస్తుంటుంది. అయితే చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ది పనుల కారణంగా ఈ రైలును తాంబరం స్టేషన్ వరకూ కాకుండా తాత్కాలికంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకే పరిమితం చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి వివిధ స్టేషన్ల మీదుగా ఈ రైలులో ప్రయాణాలు చేసే వారు తమ టికెట్లను చెన్నై బీచ్ స్టేషన్ వరకే బుక్ చేసునేందుకు అవకాశం ఉంటుంది.

Charminar Express Terminus Shifted Train to Run from Chennai Beach Not Tambaram

హైదరాబాద్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 12760 ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ చెన్నై బీచ్ వరకూ మాత్రమే ప్రయాణాలు సాగిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు చెన్నై బీచ్ కు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. అలాగే తాంబరం స్టేషన్ కు బదులుగా చెన్నై బీచ్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ నంబర్ 12759 మార్పు ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వచ్చి ఏప్రిల్ 5 వరకూ ఉంటుంది. ఈ రైలు చెన్నై బీచ్ నుంచి సాయంత్రం 6.20కు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+