వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

18 కోట్ల ఆస్థిఉన్న వితంతువుకు వరుడు కావాలి, వివాహనికి సిద్దమైన వరుడు మోసపోయాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :మ్యారేజ్ బ్యూరో పేరుతో ప్రజలను మోసం చేస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసగిస్తున్న విషయాన్ని ఓ భాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.

కరీంనగర్ జిల్లాకు చెందిన బొంతల శ్రీనివాస్ వ్యాపార నిమిత్తం నగరానికి వచ్చాడు. ఉప్పల్ సమీపంలోని భరత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. చైతన్యపురిలో కళ్యాణమస్తు మాట్రిమోనియల్ సర్వీసెస్ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించాడు. అన్ని కులాల వారికి సంబంధాలు కుదుర్చుతానని ప్రకటనలు ఇచ్చాడు.

పత్రికల్లో శచ్చిన ఈ ప్రకటనలను చూసిన అనేక మంది శ్రీనివాస్ ను నమ్మి మోసపోయారు.భీమవరంలో పెట్రోల్ బంక్, షాపింగ్ కాంప్లెక్స్ 18 కోట్ల ఆస్తులు ఉన్న 52 ఏళ్ళ వితంతు తగిన వరుడు కోసం ప్రకటన ఇచ్చాడు.ఈ ప్రకటననను చూసిన అంబర్ పేటకు చెందిన సోమేశ్వర్ రావు ఆ నెంబర్ కు ఫోన్ చేశాడు. అయితే పూర్తి వివరాల కోసం మ్యారేజీ బ్యూరోను సంప్రదించాలని సమాచారం వచ్చింది.

cheating marrage broker arrest in hyderabad

మ్యారేజీ బ్యూర్ ఎండి శ్రీనివాస్ ను సోమేశ్వర్ రావు కలిశాడు. తాను వితంతువును వివాహం చేసుకొనేందుకు సిద్దంగా ఉన్నట్టు సోమేశ్వర్ రావు శ్రీనివాస్ కు చెప్పాడు. తమ కార్యాలయంలో మూడు వేల రూపాయాలను చెల్లించి పేరును రిజస్ట్రేషన్ ను చేయించుకోవాలని శ్రీనివాస్ సూచించాడు.కొన్ని రోజుల తర్వాత మ్యారేజీ బ్యూరో కార్యాలయంలో సంప్రదిస్తే ఓ మహిళను చూపి ఆమె ప్రకటనలో చూపిన వితంతు మహిళగా శ్రీనివాస్ నమ్మించాడు.

వితంతు మహిళ పోన్ నెంబరు సోమేశ్వర్ రావు తీసుకొన్నాడు. పలుమార్లు ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించాడు.ఆమె వైపు నుండి స్పందన రాలేదు. దీంతో సోమేశ్వర్ రావు మ్యారేజీ బ్యూరో ను సంప్రదించాడు.మరో 5 వేల రూపాయాలను ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. తాను మోసపోయాయని గ్రహించిన సోమేశ్వర్ రావు పోలీసులను ఆశ్రయించడంతో శ్రీనివాస్ బండారం బట్టబయలైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

English summary
marrage broker arrested in hyderabad on tuesday. b.srinivas running kalyanamastu marrage bueruo at chaitanya puri.52 years an old widow want groom .someshewar rao want marry her.then he approach marrage bueruo, for registration 3000 rupees of money pay someshwar rao. after somedays an unkonow lady is the widow said sriivas. but that lady not response for someshwar phones. after that srinivas wanted another 5000 rupees . srinivas approached the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X