హైదరాబాద్‌లో మరోసారి చెడ్డీగ్యాంగ్ కలకలం: రూ. 7.85 లక్షలు చోరీ
హైదరాబాద్: నగరంలో మరోసారి చెడ్డీగ్యాంగ్ చోరీలు కలకలం రేపుతున్నాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేటలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో శనివారం అర్ధరాత్రి కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. చెడ్డీలు ధరించి మారణాయుధాలతో వచ్చిన దొంగలు.. స్కూల్ కార్యాలయంలోని కౌంటర్‌లో రూ. 7.85 లక్షల నగదును దోచుకెళ్లారు.
Cheddi Gang Theft in Miyapur.#CheddiGang #CheddyGangpic.twitter.com/yUyGQaoKEc
— Milagro Movies (@MilagroMovies) March 17, 2024
కాగా, ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. గత కొంతకాలంగా కనిపించని చెడ్డీగ్యాంగ్ మళ్లీ నగరంలో దొంగతనాలకు పాల్పడటంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రూప్-1 పరీక్ష కేంద్రంలో కాపీయింగ్
ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కాపీయింగ్ వ్యవహారం ఒంగోలులో వెలుగుచూసింది. ఒంగోలులోని వెంగముక్కపాలెం రోడ్డులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ అభ్యర్థి మొబైల్ సాయంతో కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు తనిఖీలు చేసినప్పటికీ.. వారి కళ్లుగప్పి సెల్‌ఫోన్‌ను లోపలికి తీసుకెళ్లాడు. బయట వ్యక్తులకు ఫోన్ చేసి సమాధానాలు తెలుసుకుని రాస్తుండగా ఇన్విజిలేటర్ గమనించి అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ అభ్యర్థిని పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications