బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్

తెలంగాణలో ముక్కా.. సుక్కా ఫేమస్.. బాధ అయినా.. సంతోషం అయినా మద్యం, మాంసంతోనే స్వాగతం పలకడం అలవాటు. అయితే రాష్ట్రంలోని మాంసం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు కమిషన్ మార్జిన్‌ ను కేజీకి రూ. 20 నుండి రూ. 8 కు తగ్గించడంతో నష్టపోతున్నామని తెలంగాణ చికెన్ షాప్‌ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తాజా బంద్ కారణంగా హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సరఫరా నిలిచిపోనుంది.

మాంసం ప్రియులకు బిగ్ షాక్.. రేపటినుంచి తెలంగా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపుల బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న కమిషన్ మార్జిన్ తగ్గింపుపై నిరసనగా చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీలు తమ లాభాలకోసం వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలు కమిషన్ మార్జిన్‌ ను కేజీకి రూ. 20 నుండి రూ. 8 కు తగ్గించడంతో నష్టపోతున్నామని వాపోతున్నారు.

Chicken Shop Strike Telangana Outlets to Close Tomorrow Over Poultry Commission Margin Row Today

మరోవైపు పెరిగిన షాపు అద్దెలు, కరెంటు బిల్లులు, వర్కర్ల జీతాల దృష్ట్యా ఇంత తక్కువ మార్జిన్‌ తో వ్యాపారం చేయడం సాధ్యం కాదని చికెన్ షాపు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చే వరకు బంద్ కొనసాగిస్తామని తెలంగాణ చికెన్ షాప్‌ ఓనర్స్ అసోసియేషన్ తాజాగా స్పష్టం చేసింది. ప్రస్తుతం కేజీకి రూ. 30 మార్జిన్ ఇస్తే తప్ప షాపులు తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తాజా నిర్ణయంతో చికెన్ ప్రియులకు బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. మరోవైపు ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల నేపథ్యంలో ఈ బంద్ వారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+