కొత్త లుక్కు: తలసాని అడ్డాలో కేసీఆర్! (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం నాడు సికింద్రాబాదులోని మోండా మార్కెట్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాదుకు శస్త్రచికిత్స చేయాలన్నారు. నగరంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. రాజధాని రూపురేఖలు మార్చాలన్నారు. మోండా మార్కెట్‌ను మోడర్నైజ్ చేస్తానని చెప్పారు.
వేసవిలో హుస్సేన్ సాగర్‌ను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలన్నారు. ప్రజలందరికి మౌలిక వసతులు కల్పించారన్నారు. కేసీఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

కేసీఆర్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 100 కోట్లతో చారిత్రక కట్టడాలకు ముప్పు వాటిల్లకుండా మోండా మార్కెట్‌ను ఆధునీకరిస్తామని చెప్పారు.

కేసీఆర్
మార్కెట్‌లో మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆయన సూచించారు.

కేసీఆర్
మరోసారి వచ్చి మార్కెట్ పరిస్థితులను సమీక్షిస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాపారులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కేసీఆర్
సచివాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, పార్లమెంటుసభ్యుడు వినోద్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కేసీఆర్
హైదరాబాద్‌లోని మురికివాడలు, నాలాల మళ్లింపు, గృహ నిర్మాణం, పచ్చదనం, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనతో పాటు తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం నాడు సికింద్రాబాదులోని మోండా మార్కెట్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్
హైదరాబాదుకు శస్త్రచికిత్స చేయాలన్నారు. నగరంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. రాజధాని రూపురేఖలు మార్చాలన్నారు. మోండా మార్కెట్‌ను మోడర్నైజ్ చేస్తానని చెప్పారు.

కేసీఆర్
వేసవిలో హుస్సేన్ సాగర్‌ను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలన్నారు. ప్రజలందరికి మౌలిక వసతులు కల్పించారన్నారు. కేసీఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Click it and Unblock the Notifications