నవంబర్ 8నుంచి చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్: ఆ విషయాన్ని పరిశీలిస్తున్నామన్న తలసాని..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఏటా హైదరాబాద్ నగరంలో నిర్వహించే చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్‌ను ఈ ఏడాది వంబర్ 8 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

  Today TOP 10 Trending News ఈరోజు టాప్ 10 న్యూస్ | Oneindia Telugu

  ఫిలిం ఫెస్టివల్ లో 83 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు హైదరాబాద్ నగరాన్ని శాశ్వత వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇందుకు ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంగీకరిస్తే ఓ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పారు.

  Children film fest in Hyd from Nov 8th says minister talasani srinivas yadav

  ఈ ఏడాది అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల నిమిత్తం రూ.5.5 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఐమాక్స్ సహా 10 థియేటర్లలో బాలల చిత్ర ప్రదర్శనలుంటాయని అన్నారు. బాలల చలన చిత్రోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర పండగగా గుర్తించే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు పేర్కొన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Hyderabad will host 20th edition of the International Children Film Festival in November. The week-long festival will be held from November 8 to 14 at Shilpakala Vedika.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి