హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిలతో జల్సాలు చేయించాడు: రాసలీలల సీడీలతో బ్లాక్‌మెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చైనా బైక్ స్కాం ఐడర్ శివ లీలలు ఒక్కటొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. చైనా బైక్ డీలర్‌షిప్‌పై ఆశలు పుట్టించిన శివకుమార్ మోసాలు మరిన్ని తెలిసి వచ్చాయి. చైనా బైక్ డీలర్‌షిప్‌పై ఆశలు పుట్టించిన శివ అమ్మాయిలతో జల్సాలు చేయించాడని, భారీ ఆదాయమంటూ బురిడీ కొట్టించాడని తెలుస్తోంది.

మోసాన్ని ప్రశ్నిస్తే రాసలీలల సిడిలో బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయి. డీలర్‌షిప్‌లు ఇప్పిస్తానంటూ రూ.10 కోట్లకుపైగా మోసాలు చేసి సీసీఎస్ పోలీసుల చేతిలో అరెస్టయి కటకటాల్లోకి వెళ్లిన ఐడర్ శివకుమార్ మోసం బిత్తరపోయేట్లు చేస్తోంది.

China bike dealer scam accused Shiva cheated public

వివరాలు ఇలా ఉన్నాయి - గుంటూరుకు చెందిన మారోజ్ శివకుమార్ ఐడర్‌మోటర్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. తాను సరికొత్తగా అధిక మైలేజి ఇచ్చే విదేశీ బైక్‌లను దేశంలోకి తీసుకువస్తున్నానని డీలర్‌షిప్‌లను ఆహ్వానించాడు. వీటి విక్రయాలపై అధిక ఆదాయం వస్తుందని ఆశ పెట్టాడు. దీంతో చాలామంది అతడిని సంప్రదించి, ఆయా ప్రాంతాలు, నగరాలను బట్టి రూ.లక్షల్లో డబ్బు చెల్లించారు.

డీలర్‌షిప్ తీసుకున్నవారిని ఆకట్టుకునేందుకు కార్పొరేట్ స్థాయిలో హంగామా చేశాడు. డీలర్లకు సంబంధించిన సమావేశాలను స్టార్ హోటళ్లు, రిస్టార్ట్సుల్లో నిర్వహించాడు. దీంతో పాటు డీలర్లకు మజా పుట్టించేందుకు అమ్మాయిలను ఎరగా వేసినట్లు తెలిసింది. కొంతమంది డీలర్లకు అమ్మాయిలను ఇచ్చి పంపించి, జల్సాలు చేయించినట్లు సమాచారం. ఆ వీడియోలను కూడా రహస్యంగా చిత్రీకరించి తన వద్ద పెట్టుకొని, డిపాజిట్లు తిరిగి ఇవ్వమని ప్రశ్నించినప్పుడు ఆ రహస్య వీడియోలను చూపించి బెదిరించాడని తెలిసింది.

కాగా, అనుమతులు లేకుండా బైక్‌లను చైనా నుంచి దిగుమతి చేసుకొని విక్రయించడంపై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని బైక్‌లను ముందుగా దిగుమతి చేసుకొని, వాటిని డీలర్లకు పంపించాడు. తరువాత విడిభాగాలను తెచ్చి, నగర శివారు ప్రాంతంలోని పెద్దఅంబర్‌పేట్‌లో బైక్ తయారీ యూనిట్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నించాడు. అతడు చూపించిన కొన్ని అనుమతి పత్రాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

English summary
astonishing details have been revealed in China bike scam accused shivakumar's case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X