హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అబ్బ..నీతీయనీ దెబ్బ.! చేతికి ఆ కట్టేంటి సర్.!చిరంజీవి గారు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : డాన్సులతో, ఫైట్స్ తో ట్రెండ్ సెట్ చేసిన చిరంజీవి ఏది చేసినా సంచలనంగానే ఉంటుంది. దాసరి నారాయణ రావు కాలం చేసిన తర్వాత ఆ స్థానాన్ని మెగాస్టార్ దాదాపు భర్తీ చేసారని తెలుస్తోంది. కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో కరోనా లాక్ డౌన్ క్లిష్ట సమయంలో వేలాది మంది సినిమా కార్మికులను, నటీ నటులను చిరంజీవి ఆదుకున్నారు. ఆ తర్వాత కరోనా బారిన పడ్డ వారు ఆక్సీజన్ లేక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసి చలించిపోయారు చిరంజీవి. ఆక్సీజన్ లేక మరణించ కూడదు అనే ధృఢ సంకల్పంతో రెండు తెలుగు రాష్ట్రాలకు ఉచితంగా ఆక్సీజన్ సరఫరా చేసారు చిరంజీవి. మానవత్వంతో మెగాస్టార్ చేస్తున్న సేవాకార్యక్రమాలు అనేకం ఉన్నాయి. కానీ వాటి గురించి ప్రచారం చేసుకోవడం మెగాస్టార్ కు ఏమాత్రం ఇష్టం ఉండదు. అనాదాశ్రమాలకు, ఉచిత చదువులకు మెగాస్టార్ పెద్ద మొత్తంలో కేటాయిస్తారనే అంశం చాలమందికి తెలియదు. ఇదిలా ఉండగా ఎప్పుడూ చూడగానే నవ్వుతూ చేతులతో అభివాదం చేసే అన్నయ్య చేతికి కట్టు కట్టి ఉండడం అభిమానులను ఆవేదనకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది.

Chiranjeevi Hand Injured.!Appeared with bands.!

తాజా బ్లడ్ బ్యంకులో కనిపించిన మెగాస్టార్ ను చూసి ఆయన శ్రేయోభిలాషులు ఆశ్చర్యానికి గురయ్యారు. కరోనావైరస్ సెకండ్ వేవ్ సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల ఎంతో మందికి సేవ చేసినందుకు వాటి బాద్యతలను విజయవంతాగా నిర్వహించిన ఇన్‌చార్జ్‌లను కలిసి చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా చిరంజీవి కుడిచేతికి కట్టుతో రావడం చర్చనీయాంశం అయింది. చిరంజీవి చేతికి ఏం అయింది అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క‌రోనా వైరస్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవ‌లందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సేవ‌ల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరి సేవలను గుర్తించిన మెగాస్టార్, హైదరాబాద్‌లోని రక్తనిధి కేంద్రంలో తెలంగాణలోని అభిమానులతో భేటీ అయ్యారు. కానీ చేతికున్న కట్టు మీదే అందరి దృష్టి కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది.

English summary
Chiranjeevi especially appreciated the in-charges served by oxygen banks. Chiranjeevi's handcuffing during the event was the talk of the town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X