ఏఎన్ఆర్ జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి.. మోహన్ బాబుపై పరోక్ష కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డును చిరంజీవికి ప్రకటించారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈరోజు జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుకకు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాన్ని అమితాబ్... చిరంజీవికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవికి శాలువా కప్పి సన్మానించారు.

ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు హాజరయ్యారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా నాగార్జున ఈ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా పరిశ్రమలోనూ వజ్రోత్సవాల సమయంలో తనకు లెజెండరీ అవార్డు ఇచ్చినప్పుడు కొంతమంది వ్యతిరేకించారని, దీంతో ఆ అవార్డు తీసుకోకుండా క్యాప్సూల్ బాక్సులో వేసిన సంగతి గుర్తు చేసుకున్నారు.పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులు వచ్చినా అసంతృప్తి మిగిలే ఉంది' అని చిరంజీవి ఎమోషన్ కామెంట్స్ చేశారు.కానీ ఇప్పుడు ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఇచ్చిన ఈ రోజున... అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఇచ్చిన ఈ రోజున... నా మిత్రుడు నాగార్జున నాకు మనస్ఫూర్తిగా ఈ అవార్డు ఇచ్చిన రోజున... ఇప్పుడు నాకు ఇంట గెలిచానని అనిపిస్తోందన్నారు. నేను ఇంటా గెలిచాను... రచ్చా గెలిచానన్నారు.












Click it and Unblock the Notifications