ఇవాంక వెనక ఉపాసన: క్లిప్పింగ్స్ పంపిన చిరంజీవి, చెర్రీ
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ్ ఉపాసన ఇవాంక ట్రంప్ వెనక కూర్చుని ఉన్న క్లిపింగ్స్‌ను ఆమెకు పంపించారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలిపారు. హైదరాబాదులోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు మంగళవారం ప్రారంభమైంది.
Recommended Video

GES 2017: Ivanka Trump Says,Modi's Rise From Tea Seller Is Exemplary
ప్రధాని నరేంద్ర మోడీ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హాజరయ్యారు. అయితే ఈ సదస్సుకు ఉపాసన, నారా బ్రాహ్మణి, మంచు లక్ష్మి తదితరులు కూడా హాజరయ్యారు.

ఈ సదస్సులో తాను ఇవాంకా ట్రంప్ వెనుక కూర్చొని ఉన్న క్లిప్పింగ్‌ని తన మామయ్య చిరంజీవి, భర్త రామ్‌చరణ్‌లు తనకు పంపినట్లుగా ఉపాసన తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.
ఇవాంకా వెనుక తాను కూర్చుని ఉన్న క్లిప్‌ని పోస్ట్ చేసి.. "మా మామయ్య, మిస్టర్ సిలు టీవీలో నేను కనిపిస్తున్న ఈ క్లిప్‌ని పంపించారు. పారిశ్రామిక విధానంలో మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాలని నమ్ముతున్న వారికి ధన్యవాదాలు" అన్నారు.












Click it and Unblock the Notifications