చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి...
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మోజిగూడెం సమీపంలో లారీ-బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వేంబ్రిడ్జి వద్ద లారీని రివర్స్ చేస్తుండగా... అది రోడ్డుపైకి రావడంతో... వెనుక నుంచి వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టింది. లారీ సడెన్‌గా రోడ్డు పైకి రావడంతో బైక్ ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో చిట్యాల మండలం పిట్టంపల్లికి చెందిన హరీశ్,హైదరాబాద్‌లోని రామాంతపూర్‌కి చెందిన మరో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్‌పై ముగ్గురు పిట్టంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన ముగ్గురు యువకులు ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.మిర్యాలగూడ సమీపంలోని చింతపల్లి హైవే వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ టావెల్స్ బస్సు రోడ్డుపైన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, 10మందికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతులను మల్లికార్జున్(40),నాగేశ్వర్‌రావు(44),గుంటూరు జిల్లాకు చెందిన జయరావ్(42)లుగా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదే నల్గొండ జిల్లాలో ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్-నాగార్జున సాగర్‌హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఐదుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా... మిగతా నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరంతా పీఏపల్లి మండలం రంగారెడ్డి గూడెంలో వరి నాట్లు వేసేందుకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు.
Recommended Video
మార్గమధ్యలో ఓ బొలెరో వాహనం అదుపు తప్పి ఆటో వైపు దూసుకొచ్చింది. దాన్ని తప్పించేందుకు ఆటో డ్రైవర్ మల్లేశం... వాహనాన్ని రోడ్డు మధ్యకు తిప్పాడు.దీంతో అటుగా వస్తున్న లారీ ఆటోను అతివేగంతో ఢీకొట్టింది. దీంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జవగా కూలీలంతా చెల్లాచెదురుగా చెడిపోయి ఆ ప్రాంతం రక్తసిక్తంగా మారింది. కూలీలంతా మరో అరగంటలో ఇల్లు చేరుతారనగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం అందరినీ కలచివేసింది.ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతిచెందిన కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయాల పాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications