స్త్రీకి అసభ్య సందేశాలు, సిఐడి ఇన్‌స్పెక్టర్ అరెస్ట్: భర్తను చంపిన భార్య

హైదరాబాద్/కరీంనగర్: హైదరాబాద్ సీఐడీ ఇన్‌స్పెక్టర్ దయాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తనను దయాకర్‌రెడ్డి వేధించాడంటూ కరీంనగర్ శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ మహిళ కేసు పెట్టింది. వాట్సప్, ఫోన్ల ద్వారా అసభ్యకర సందేశాలు పంపించారంటూ దయాకర్‌రెడ్డిపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.

మహిళ ఫిర్యాదుతో దయాకర్‌రెడ్డిపై కొద్ది రోజుల క్రితం నిర్భయ కేసు నమోదైంది. దయాకర్‌రెడ్డిని సోమవారం అరెస్టు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా కోర్టులో హాజరుపరిచారు. మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసులో దయాకర్‌రెడ్డి విచారణ అధికారిగా ఉన్నారు.

ఇదిలావుంటే, నిత్యం తాగివచ్చి వేధిస్తున్న భర్తను భార్య చంపేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలంలోని కుమ్మరిపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వెల్గటూరు మండలంలోని కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన ఎల్లమ్ముల బాలయ్య (45) వెల్గటూరులోని ఓ ఫెర్టిలైజర్ షాపులో దినసరి కూలీగా పని చేసేవాడు.

CID inspector Dayakar reddy arrested

అతను శనివారం రాత్రి మద్యం సేవించి వచ్చి భార్య మల్లమ్మను తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత తన తల్లి బుచ్చమ్మపై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో భార్య మల్లమ్మ ఇంట్లోని మంచం కోడుతో బాలయ్య తలపై కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా, బాలయ్య పదేళ్లుగా మద్యం సేవించి వచ్చి మల్లమ్మను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని బంధువులు తెలిపారు. ఘటనా స్తలానికి పెద్దపల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, చొప్పదండి సీఐ లక్ష్మీబాబు, ప్రొబేషనరీ ఎస్‌ఐ స్వరూప్‌రాజ్ చేరుకొని పరిశీలించారు. బాలయ్య తల్లి మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+