ఇదెక్కడి న్యాయం.. సర్: మంత్రి కేటీఆర్‌కు సినీనటి అనసూయ వరుస ట్వీట్లు
హైదరాబాద్: పాఠశాలకు వెళ్లే చిన్నారుల భద్రత సమస్యను సినీనటి, టీవీ యాంకర్ అనసూయ తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. పిల్లను తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని ఆమె తెలిపారు.
పిల్లల భద్రతపై స్కూల్స్ ఎలాంటి భరోసా ఇవ్వడం లేదని ఆమె మంత్రి కేటీఆర్‌కు శుక్రవారం ఉదయం ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. కేటీఆర్ సర్ నాకో డౌట్ అంటూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

కేటీఆర్ సర్.. కరోనా కారణంగా మొదట మనం లాక్‌డౌన్ ఫాలో అయ్యాం. దేశ వ్యాప్తంగా కేసులు క్రమంగా తగ్గుతుండటంతో లాక్‌డౌన్‌ని తొలగించారు. దేశంలో వ్యాక్సినేషన్ కూడా వేగంగా సాగుతోంది. కానీ, వ్యాక్సిన్ తీసుకోని చిన్నారుల పరిస్థితి ఏమిటి? స్కూల్‌లో పిల్లలకు ఏం జరిగినా యాజమాన్యానిది బాధ్యత కాదని చెబుతూ తల్లిదండ్రులు మొదట ఓ అంగీకరపత్రాన్ని తప్పకుండా అందజేయాలని స్కూల్స్ ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయి? చెప్పండి సర్.. ఇదెక్కడి న్యాయం? ఎప్పటిలాగే ఈ విషయాన్ని కూడా మీరు సమీక్షిస్తారని భావిస్తున్నా.. అంటూ వరసు ట్వీట్లలో అనసూయ పేర్కొన్నారు.
కాగా, సినీనటిగా మారిన బుల్లితెర యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా బుల్లితెరపై మకుటం లేని మహరాణిగా.. టాప్ యాంకర్‌గా కొనసాగుతున్నారు అనసూయ. కేవలం యాంకర్‌గానే కాకుండా.. వెండితెరపై భిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రంగమ్మత్తగా రంగస్థలం సినిమాలో అనసూయ నటనకు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాతో వెండితెరపై అనసూయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వరుస ఆఫర్లను అందుకుంటూ అటూ వెండితెరపైనా బిజీగా మారిపోయారు అనసూయ.












Click it and Unblock the Notifications