నగర వాసులకు ఆహ్లాదం.!ఎటు చూసినా పచ్చదనమే.!జీహెచ్ఎంసీ వినూత్నంగా మొక్కల పెంపకం.!

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణతో పాటుగా సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని నగర వాసులకు చక్కటి వాతావరణ కల్పించేందుకు వివిధ వినూత్న ఆలోచనలకు అనుగుణంగా విరివిరిగా మొక్కలు పెంచడం జరుగుతున్నదని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా శనివారం బంజారాహిల్స్ గఫార్ ఖాన్ పార్క్ లో మేయర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... తెలంగాణకు హరిత కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి పరిధిలో 2014 నుండి 2022-23 వరకు 741 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం కాగా 698.78 లక్షల మొక్కలు నాటినట్లు మేయర్ వివరించారు.

జిహెచ్ఎంసి పరిధిలో పచ్చదనం : అవెన్యూ ప్లాంటేషన్, కాలనీ ఇనిస్టిట్యూషన్, ఓపెన్ స్పేస్, స్మశాన వాటికల్లో, మొదలైన వినూత్న, పద్ధతిలో జిహెచ్ఎంసి పరిధిలో పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. జిహెచ్ఎంసి బడ్జెట్ లో ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో రూ. 326 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల మొక్కల పెంపకం లక్ష్యం కాగా లక్ష్యాన్ని మించి 77.29 లక్షల మొక్కలు పెంచడం జరిగిందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి కి 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యం కాగా ఇప్పటి వరకు సుమారు 42 లక్షల మొక్కలు నాటడం జరిగిందనన్నారు మేయర్.

City dwellers are happy!Everywhere you look, its green.GHMC innovative plant breeding.
నగరంలో 600 నర్సరీలు : మొక్కల సౌలభ్యత కోసం నగరంలో 600 నర్సరీలను ఏర్పాటు చేసి అవసరమైన మొక్కలు సిద్ధం చేసుకుంటారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఒకే రోజు కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి పరిధిలో 1 లక్ష 50 వేల మొక్కలు నాటారని తెలిపారు. నగరాన్ని ఆకు పచ్చని నగరంతో పాటు ప్రజలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు జిహెచ్ఎంసి రోనాల్డ్ రోస్ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దేశించిన విధంగా వి.ఎస్.టి వద్ద మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు.

City dwellers are happy!Everywhere you look, its green.GHMC innovative plant breeding.
కోటి మొక్కలు నాటే లక్ష్యం : ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కోటి మొక్కలు నాటేందుకు లక్ష్యంలో భాగంగా జిహెచ్ఎంసి పరిధిలో నిర్దేశించిన 1 లక్ష 30 వేల లక్ష్యాన్ని అధిగమించి నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎం.పి లు, కార్పొరేటర్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, జిహెచ్ఎంసి పరిధిలో నిర్దేశించిన 1 లక్ష 30 వేలకు గాను 1 లక్ష 50 వేల మొక్కలను 292 లోకేషన్ల లో నాటినట్లు కమిషనర్ వివరించారు. పర్యావరణాన్ని మెరుగుపరచడం, వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి చేపట్టిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమం ద్వారా సాధ్యమయ్యిందని కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+