ఐడి కార్డులపై ఘర్షణ: రణరంగంగా మారిన గాంధీ ఆస్పత్రి

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి శనివారం రణరంగంగా మారింది. ఆస్పత్రి, మెడికల్ కాలేజీ సిబ్బంది మధ్య ఐడీ కార్డు చూపించే విషయమై పెద్ద గొడవ జరిగింది. పర్యవసానంగా ఇరు వర్గాల ఉద్యోగులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మెడికల్ కాలేజీ సిబ్బందికి, ఐదుగురు సెక్యూరిటీ గార్డులకు తీవ్ర గాయలయ్యాయి.

గాంధీ ఆస్పత్రిలో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగి ఒకరు శనివారం ఆసుపత్రిలోకి క్యారేజితో వెళ్తుండగా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. 30 సంవత్సరాలు ఇక్కడే పనిచేసి తనను గుర్తు పట్టవా? అంటూ ఆ రిటైర్డ్ ఉద్యోగి నిలదీశాడు. ఐడీ కార్డు చూపించాల్సిందేనని సెక్యూరిటీ ఉద్యోగి చెప్పాడు. దీంతో రిటైర్డ్ ఉద్యోగి ఆస్పత్రిలోకి ప్రవేశించడానికి యత్నించాడు.

 Clash among the Gandhi hospital staff on ID cards

సెక్యూరిటీ గార్డు ఆయనను తోసేశాడు. దీంతో రిటైర్డ్ ఉద్యోగి ముప్పై మంది వరకు మెడికల్ సిబ్బందిని తీసుకొని వచ్చాడు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.

దాదాపు అరగంటపాటు ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. రిటైర్డ్ ఉద్యోగి 30 మంది వైద్య సిబ్బందిని తీసుకుని వచ్చాడు. దాంతో తమపై దాడి చేయడానికి వస్తున్నారని సెక్యూరిటీ సిబ్బంది ఎదురు దాడికి దిగింది. దీంతో ఘర్షణ ప్రారంభమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+