• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మిస్సింగ్ కేసు.. రెండున్నరేళ్లకు బయటపడ్డ అసలు నిజం... సినీ ఫక్కీలో వెలుగుచూసిన ఉదంతం...

|

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రెండున్నరేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు మిస్టరీని తాజాగా పోలీసులు చేధించారు. నిజానికి ఇది మిస్సింగ్ కేసుగా నమోదవగా... అంతా ఇక దీన్ని మరిచిపోతున్న తరుణంలో ఊహించని విధంగా కేసులో కీలక ఆధారాలు చిక్కాయి. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. అది మిస్సింగ్ కేసు కాదని హత్యేనని పోలీసులు నిర్దారించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఇల్లందు పట్టణంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

ఇల్లందు పట్టణానికి చెందిన ఎంపీటీసీపై ఈ నెల 3న హత్యాయత్నం జరగ్గా దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో ఓ నిందితుడు... మరో హత్య గురించి బయటపెట్టాడు. రెండేళ్ల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదైన దైదా విజయ్ కుమార్(24) అలియాస్ శివ హత్యకు గురయ్యాడని చెప్పాడు. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. అతను చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

రెండున్నరేళ్ల క్రితం హత్య...

రెండున్నరేళ్ల క్రితం హత్య...

దైదా విజయ్ కుమార్ తండ్రి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకు ఐదుగురు సంతానం. ఆ ఐదుగురిలో విజయ్ ఒక్కడే దారి తప్పాడు. చదువు సంధ్యా లేకుండా రౌడీ గ్యాంగ్‌లతో తిరిగేవాడు. ఇదే క్రమంలో గ్రూపు తగాదాల్లో ఇరుక్కున్నాడు. దీంతో విజయ్‌పై కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు ఆటోడ్రైవర్ రాజ్‌కమల్,లారీ డ్రైవర్ తంబల్ల కమల్,కూలీ పనిచేసే బాబు రాజ్ అనే ముగ్గురు అతని హత్యకు స్కెచ్ వేశారు. సెప్టెంబర్ 9,2018న ఇల్లందు ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద విజయ్‌ ఒంటరిగా దొరకడంతో బ్యాట్లతో దాడి చేశారు. అప్పటికే చీకటి పడటంతో... గుట్టు చప్పుడు కాకుండా సమీపంలోని శ్మశాన వాటికలో శవాన్ని పూడ్చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు....

మిస్సింగ్ కేసు నమోదు....

విజయ్‌ కనిపించకపోవడంతో అతని కుటుంబం మిస్సింగ్ కేసు నమోదు చేసింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆ కేసులో పురోగతి లేదు. అనూహ్యంగా ఎంపీటీసీ హత్య కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు విజయ్ హత్యకు గురయ్యాడని చెప్పడంతో కేసు మిస్టరీ వీడింది. అతను చెప్పిన వివరాల ఆధారంగా స్థానిక శ్మశానంలో విజయ్‌ని పూడ్చి పెట్టిన చోట తవ్వి చూశారు. కుటుంబ సభ్యులు అది విజయ్ మృతదేహమేనని గుర్తించారు. దీంతో మృతదేహం నుంచి సేకరించిన నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

నిందితుల అరెస్ట్...

నిందితుల అరెస్ట్...

విజయ్ హత్య కేసులో నిందితులైన రాజ్‌కమల్, తంబల్ల కమల్,బాబు రాజ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తాజాగా స్పష్టం చేశారు. ప్రస్తుతం వారు రిమాండ్‌లో ఉన్నారని... హత్యతో సంబంధం ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని చెప్పారు. త్వరలోనే పూర్తి స్థాయి విచారణ జరిపి వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. రెండున్నరేళ్ల క్రితం అదృశ్యమైన విజయ్ హత్యకు గురయ్యాడని నిర్దారణ కావడంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. రెండేళ్ల తర్వాత వీడిన ఈ మిస్టరీ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

English summary
A missing filed two years back turned out to be a murder in Yellandu town in Bhadradri Kothagudem district.Police chased the mystery case while interrogating an accused in other murder attempt case. Police arrested the accused according to the details they got,and sent them to remand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X