తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, రైతులకు కీలక హామీ..!!

మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. రైతులను పరామర్శించారు. జరిగిన నష్టం పైన వివరాలు సేకరించారు. ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పంటలకు చేయించిన బీమా పైన ఆరా తీసారు. నష్ట పోయిన రైతులకు తమ ప్రభుత్వం సాయం అందిస్తుందని స్పష్టం చేసారు. తుఫాను సమయంలో జిల్లెళ్ల అమ్మవారి భక్తులు అందించిన సాయం పైన తెలుసుకున్న సీఎం.. వారిని అభినందించారు.

 సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టులో కీలక విచారణ, ఆదేశాలు..!!
సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టులో కీలక విచారణ, ఆదేశాలు..!!

మురుసు తుఫాను కారణంగా జరిగిన నష్టం పైన సీఎం చంద్రబాబు బాధితులను కలిసారు. నేరు గా వారి నుంచి వివరాలు సేకరించారు. ఏరియల్ సర్వేలో నష్టపోయిన పంటలను పరిశీలించిన చంద్రబాబు.. తుఫాను ప్రభావిత ప్రాంత రైతులను కలిసారు. బాపట్ల జిల్లా జిల్లెళ్లమూడిలో నీట మునిగిన వరి పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులతో మాట్లాడారు. సాగు కోసం ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు? పంట చేతికి వచ్చే దశలో ఎంత మేర నష్టం వాటిల్లిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరవు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటిని అందించి పంటలను కాపాడిందని, అయితే పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను తీవ్ర నష్టం కలిగించిందని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

కూటమి నేతలకు తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!!
కూటమి నేతలకు తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!!
CM Chandrababu Visits Murasu Cyclone-Hit Areas Assures Support to Victims here the details

ఇదే సమయంలో రైతులు పంటల బీమా చేయించుకున్నారా అని చంద్రబాబు ఆరా తీశారు. ప్రకృతి విపత్తుల సమయంలో పంటల బీమాతో పాటు ప్రభుత్వం అందించే ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. పంటల బీమా వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లెళ్లమూడి వంతెన వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వరద ప్రవాహ ఉధృతిని పరిశీలించారు. వాగు ఉధృతి కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

తమ గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రిని జిల్లెళ్లమూడి అమ్మ భక్తులు కలిశారు. వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న చంద్రబాబు వారి సేవలను అభినందించారు. తీర ప్రాంతాలను తుఫాన్లు దెబ్బతీస్తే... రాయలసీమ ప్రాంతాన్ని ఎల్ నినో ఇబ్బంది పెట్టిందని సీఎం పేర్కొన్నారు. రాయలసీమలో కూడా కరువును అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందాలు పర్యటించాయని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+