కూటమి నేతలకు తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!!

కూటమి నేతలకు సీఎం చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. స్థానిక సంస్థల వేళ కూటమి నేత ల సమన్వయం.. క్షేత్ర స్థాయిలో పోలింగ్ గురించి కీలక సూచనలు అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయంతో ఫలితాలు సాధించామని.. అన్ని ఎన్నికల్లో ఇదే విధంగా మూడు పార్టీల నేతలు కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండటంతో... క్షేత్ర స్థాయిలో వ్యవహరించాల్సిన తీరు పైన చంద్రబాబు కూటమి నేతలకు మార్గ నిర్దేశం చేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేసారు.

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల వ్యూహాల పైన కూటమి నేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంత మాత్రం తగ్గకూడదని కూటమి నేతలు, కేడర్‌కు చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్డీఏ ముఖ్య నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులు తదితరులు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని వారికి దిశానిర్దేశం చేశారు. పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ సజావుగా జరిగేలా సహకరించాలని కూటమి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని ఆకాంక్షించారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియను అడ్డుకునేలా ఎవరైనా ప్రయత్నిస్తే వెంటే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని వారికి సూచించారు.

 వంగవీటి రాధా ఘన విజయం.. మెజార్టీ: ABV కి దక్కిన ఓట్లు, రెండో స్థానం..!!
వంగవీటి రాధా ఘన విజయం.. మెజార్టీ: ABV కి దక్కిన ఓట్లు, రెండో స్థానం..!!
cm-chandrababu-urges-alliance-leaders-to-ensure-high-voter-turnout-in-zptc-mptc-polls

కూటమి నేతలకు చంద్రబాబు సూచనలు

ప్రత్యర్థి పార్టీ ఏమైనా అక్రమాలకు పాల్పడితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొ న్నారు. ఓ వేళ ఘర్షణలు చోటు చేసుకుంటే సంయమనం పాటించాలని కూటమి కార్యకర్తలకు సీఎం చంద్రబాబు సూచించారు. కాగా.. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది, 7,767 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 31,460 పోలింగ్ కేంద్రాల్లో 2.61 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ తొలి రెండు గంటల్లో తొమ్మది శాతం నమోదైంది. పులివెందుల, చంద్రగిరి, రైల్వే కోడూరు ప్రాంతాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉండటంతో.. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+