‘‘ఇదేమీ కేసీఆర్ అయ్య జాగీర్ కాదు, అడ్డగోలుగా ప్రవర్తించడానికి’’
రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ల ఘటనపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అధికారపక్ష నేతలు అనడంపై కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్లలో పదకొండు మందిపై దాడి జరిగితే అందులో నలుగురు మాత్రమే దళితులు ఉన్నారని.. ఈ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అధికారపక్ష నేతలు అనడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
ఈ విషయమై ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నకు ఉత్తమ్ సమాధానమిస్తూ, 'దళితులు కాని వాళ్లపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించవచ్చా? ముఖ్యమంత్రి చెప్పే సమాధానమిదా? ' అని ప్రశ్నించారాయన.

అంతేకాదు, అసలు, ఈ విధంగా మాట్లాడుతున్న వారికి కామన్ సెన్స్ ఉందా? ఏ కులం వారినైనా సరే, అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకుని టార్చర్ పెట్టి, కరెంట్ షాక్ పెట్టొచ్చా? ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోరు? అని నిలదీశారు.
ఈ సంఘటనపై ఆ జిల్లా ఎస్పీ.. 'టార్చర్ చేయమంటేనే చేశాం' అని చెబుతున్నారు. అందుకే, పోలీసులపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవట్లేదని, ఈ విషయాన్ని తామూ వదలిపెట్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతేకాదు, ఇదేమీ కేసీఆర్ అయ్య జాగీర్ కాదు.. అడ్డగోలుగా ప్రవర్తించడానికి.. పోలీసులేమీ ఆయన ప్రైవేట్ సైన్యం కాదు.. ఈ విషయమై తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ప్రతిఘటిస్తుంది..' అని ఉత్తమ్ హెచ్చరించారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications