రేవంత్ రెడ్డి Vs ఫడ్నవిస్.. కొత్త రచ్చ స్టార్ట్.. !!
తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ కు తెర లేచింది. ఇటీవలే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఫడ్నవీస్ తాజాగా తప్పుపట్టారు. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ విధానాలనే ఆయన తప్పు పట్టారు. కాంగ్రెస్ వల్లే దేశంలో ఈ దుస్థితి తలెత్తిందంటూ మండిపడ్డారు. తమది సమ్మిళిత విధానమంటూ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ కు అటువంటి విధానం లేదని విమర్శించారు.
మైనారిటీ రిజర్వేషన్ల విషయంలో ఇటీవలే రేవంత్ రెడ్డి.. బీజేపీకి సవాల్ విసిరారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు అమవుతున్న నాలుగు శాతం రిజర్వేషన్ కోటాను రద్దు చేస్తామంటూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. హైదరాబాద్‌లో జమాతే ఉలామా తెలంగాణ సంప్రదింపుల సమావేశంలో దీని గురించి ప్రస్తావించారు. అలాగే- మహబూబ్‌నగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నిర్వహించిన సభలో చేసిన వ్యాఖ్యలనూ తిప్పికొట్టారు రేవంత్.

దమ్ముంటే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీకి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. విద్వేష ప్రసంగాలపై ప్రతిపాదిత చట్టం రూపకల్పనలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సహాయం కోరారు రేవంత్ రెడ్డి. నితిన్ నబీన్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎవరో ఢిల్లీ నుంచి మహబూబ్‌నగర్‌కు వచ్చి ఏం మాట్లాడారో తెలంగాణ సమాజం ఆలకించిందని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా ప్రసంగించారని పేర్కొన్నారు.
#WATCH | Nagpur | On the statement of Telangana CM Revanth Reddy, Maharashtra CM Devendra Fadnavis says, "The country was partitioned because of the Congress party's politics of appeasement and today also they are practising the politics of appeasement. Our motto is justice for… pic.twitter.com/xgXV8wQ2er
— ANI (@ANI) February 7, 2026
ఈ వ్యాఖ్యలకు తాజాగా దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. తెలంగాణలో ప్రవేశపెట్టనున్న కొత్త చట్టంపై చేసిన ప్రకటనలపై ఘాటు విమర్శలను గుప్పించారు. నాగపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న బుజ్జగింపు రాజకీయాల వల్లే దేశం విడిపోయిందని ధ్వజమెత్తారు. దేశ విభజన జరిగి ఇన్ని సంవత్సరాలైనప్పటికీ ఆ పార్టీ నేటికీ ఇదే విధానాన్ని కొనసాగిస్తోందని దేవేంద్ర ఫడ్నవిస్ మండిపడ్డారు.
తమ పార్టీ విధానాలు దీనికి పూర్తి విరుద్ధమని దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. అందరికీ సమ న్యాయం చేయడమే తమ పార్టీ ప్రధాన అజెండా అని ఆయన పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ మాదిరిగా ఏ ఒక్క వర్గాన్నీ తాము బుజ్జగించబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలనేవి తమ విధానం కాదని, అందరినీ సమంగా చూడటమే తమ నినాదమని ఫడ్నవిస్ పేర్కొన్నారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications