మహాధర్నాలో కేసీఆర్ పాల్గొంటున్నారు! తెలంగాణకే ఎందుకిలా: కేంద్రంకు హరీశ్ రావు ప్రశ్నలు

హైదరాబాద్: రైతుల కోసమే టీఆర్ఎస్ మహాధర్నా తలపెట్టిందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పారు. తెలంగాణ రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా తలపెట్టినట్లు తెలిపారు. గురువారం ఇందిరాపార్కు వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నా ఏర్పాట్లను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు.

తెలంగాణకే ఇందుకిలా: హరీశ్ రావు

తెలంగాణకే ఇందుకిలా: హరీశ్ రావు

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా టీఆర్‌ఎస్‌ ప్రజలవైపే ఉంటుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. లక్షలాది మంది రైతుల పక్షాన నిలబడి కేంద్రం మొండి వైఖరిని నిరసిస్తూ మహాధర్నా తలపెట్టామని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఒకే విధానం ఉండాలి. పంజాబ్ లో పండిన ప్రతి గింజా కొంటారెందుకు? తెలంగాణలో కొనరెట్లా? రాస్ట్రానికో విధానం ఉంటుందా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు హరీశ్ రావు. వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. ప్రజాస్వామ్య యుతంగా నిరసన వ్యక్తం చేస్తాం. టీఆర్ఎస్ ఎల్లప్పుడు రైతుల పక్షాపాతి అని హరీష్‌ పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరగడం కోసమే ఈ ధర్నా నిర్వహి స్తున్నామన్నారు.

మహాధర్నాలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటరు: హరీశ్ రావు

మహాధర్నాలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటరు: హరీశ్ రావు

కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల న్నారు హరీశ్ రావు. ధాన్యం కొనకుండా రైతులను కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూస్తోందని దీనిని టీఆర్‌ఎస్‌ అసలే సహించదని, కేంద్రంతో కొట్లాడైనా రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హరీష్‌ రావు అన్నారు. రాష్ర్ట రైతులందరి పక్షాన ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు, డీసీఎంఎస్ ఛైర్మన్లు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని రైతుల పక్షాన నిరసన తెలుపుతామని చెప్పారు. అత్యంత శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మహాధర్నా నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Recommended Video

    AP Cabinet : APలో కేబినెట్ విస్తరణ.. ప్రశాంత్ కిషోర్ మంత్రాంగం..!! || Oneindia Telugu
    ధాన్యం కొనుగోలుపై బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. రైతుల పాట్లు

    ధాన్యం కొనుగోలుపై బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. రైతుల పాట్లు

    విభజన సమయంలో తెలంగాణ‌కు చెందిన‌ ఏడు మండ‌లాల‌ను, లోయ‌ర్ సీలేరు ప‌వ‌ర్ ప్లాంట్‌ను అన్యాయంగా ఆంధ్రాలో క‌లిపారని, దీని వ‌ల్ల సంవ‌త్స‌రానికి రూ. వెయ్యి కోట్ల న‌ష్టం వాటిల్లుతుంద‌న్నారు హరీశ్ రావు. ఏడు మండ‌లాల‌ను, లోయ‌ర్ సీలేరును ఆంధ్రాలో క‌లిపిన నాడే కేసీఆర్ తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారని తెలిపారు. కాగా, ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం కొంటామని చెప్పినా.. కేసీఆర్ అబద్ధాలు చెబుతూ రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌ను టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకుని కోడిగుగ్లు, రాళ్లు, టమాటాలతో దాడులు చేసిన విషయం తెలిసింది. మరోవైపు, కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేసేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ మంగళవారం మాట్లాడుతూ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేసే వరకూ వెంటపడతామని చెప్పుకొచ్చారు. ఏది ఎలావున్నా.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు రైతులు పంట కొనుగోలు కేంద్రాల వద్ద మరణించిన విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+