భధ్రాద్రి: పట్టువస్ర్తాలు సమర్పించిన కేసీఆర్ (ఫోటోలు)
హైదరాబాద్: భద్రాచలంలో కన్నుల పండువగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచంల శ్రీరామచంద్రుడిని శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పూర్ణకుంభంతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు.
కేసీఆర్ స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలు, ముత్యాలతలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకలకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భద్రాద్రికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సీఎంతో పాటు మంత్రుల రాకతో భద్రాచలంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలోని పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. శ్రీరామ సీతా విగ్రహాలను సుందరంగా అలంకరించి... కల్యాణ మండపానికి స్వామివారి వూరేగింపు ప్రారంభమైంది.
రామనామస్మరణతో భద్రాద్రి మార్మోగుతోంది. సీతారాముల కళ్యాణానికి మిథిలా ప్రాంగణం సిధమైంది. కళ్యాణ మూర్తులను సుందరంగా అలంకరించి ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం 12.30గంటల వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది.

ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భద్రాద్రిలో జరుగుతున్న మొదటి సీతారామ కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ మంత్రులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్
శనివారం ఉదయం 10 గంటలకు ఆలయానికి సీఎం చేరుకున్నారు. ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలను సమర్పించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు జరుగుతున్న కల్యాణమహోత్సవంలో పాలుపంచుకుంటున్నారు.

ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్
మధ్యాహ్నం కల్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత సీఎం రోడ్డు మార్గం గుండా భద్రాచలం నుంచి బయల్దేరి పినపాక నియోజకవర్గంలోని మణుగూరుకు వెళ్తారు. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దు గ్రామాల్లో రూ. 5044 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 1080 మెగావాట్ల భద్రాద్రి విద్యుత్‌ప్లాంట్‌కు భూమిపూజ చేస్తారు.

ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్
శ్రీరామనవమి సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలోని పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు.

ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్
శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. శ్రీరామ సీతా విగ్రహాలను సుందరంగా అలంకరించి... కల్యాణ మండపానికి స్వామివారి వూరేగింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30గంటల వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది.












Click it and Unblock the Notifications