కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి - రాఖీ వేళ ప్రగతి భవన్ లో..!!
రక్షా బంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో ఆత్మీయంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరీమణులు సీఎం నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసిఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం కేసిఆర్ మనుమడు మనుమరాలు రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు.
తన అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది. వారిని సీఎం కేసీఆర్ దంపతులు ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్.. ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. రక్షా బంధన్ కావటంతో మంత్రి కేటీఆర్ ఆసక్తి కర ఫొటోలతో ట్వీట్ చేసారు. కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి అంటూ పోస్టు చేసారు. అందులో తన కుమారుడు - కుమార్తె ఫొటోతో పాటుగా.. తనతో పాటుగా తన సోదరి కవిత చిన్నప్పటి ఫొటోను జత చేసారు.

ప్రతీ ఏటా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన సోదరీమణులు రాఖీ కడతారు. ఈ సారి అదే తరహాలో ముఖ్యమంత్రికి రాఖీ కట్టి పండుగ ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక, మంత్రులు - పార్టీ నేతలకు పెద్ద సంఖ్యలో మహిళలు రాఖీలు కట్టారు. గ్రేటర్ మేయర్ విజయలక్ష్మీ మంత్రులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు.












Click it and Unblock the Notifications