బీఆర్ఎస్ జాబితాలో ఉన్నదెవరు,మారేదెవరు - లోక్ సభకు ఆ మంత్రులు..!?
తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్దుల జాబితాలు సిద్దం అవుతున్నాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సీఎం కేసీఆర్ తొలి జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ నెల 21న దాదాపు 60 మందితో లిస్టు విడుదలకు రంగం సిద్దమైంది. అందులో ఇప్పుడు సిట్టింగ్ లకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో, లిస్టులో ఉండేదెవరు.. మారేదెవరనేది ఆసక్తి కరంగా మారింది. కొందరు మంత్రులను లోక్ సభకు పంపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తొలి జాబితాపై కసరత్తు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేసిన కేసీఆర్ జాబితాను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న 60 మందికి పైగా పేర్లతో లిస్టు ప్రకటించన్నారు. గెలుపు గుర్రాలకు ప్రాధాన్యతనిస్తూ, ఆచితూచి అభ్యర్థుల ఎంపిక జరిగింది. సిట్టింగ్ లకు తిరిగి సీట్ల ఖరారులో ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఎంపిక చేసినట్లు సమాచారం.

సర్వే నివేదికల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేస్తున్నారు. 20 మందికిపైన సిట్టింగ్ లకు టికెట్ దక్కదని తెలుస్తోంది. వారికి ఇప్పటికే బుజ్జగింపులు మొదలయ్యాయి. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తే భవిష్యత్తులో ఇతర అవకాశాలు ఇస్తామని కీలక నేతలు నచ్చజెప్తున్నట్టు సమాచారం.
దక్కేదెవరు..మారేదెవరు: ఇదే సమయంలో టికెట్ దక్కదనే సంకేతాలు అందుకున్న ఎమ్మెల్యేలు కేడర్‌తో భేటీలు జరుపుతూ బలప్రదర్శన ద్వారా అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలు, 2018లో కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరినవారు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
2018లో ఏడుగురు సిట్టింగ్ లకు కేసీఆర్ టికెట్లు నిరాకరించారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి 12 మంది, టీడీపీ నుంచి ఇద్దరితోపాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మళ్లీ టికెట్ ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారిలో ఒకరిద్దరికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని సమాచారం.

లోక్ సభకు ఆ మంత్రులు: కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు బదులుగా ఆయన కుమారుడు డాక్టర్ సంజయ్‌కు టికెట్ ఇవ్వొచ్చనే అంచనా ఉంది. దీనితోపాటు కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), లక్ష్మీకాంతరావు (వేములవాడ), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), బండారి లక్ష్మారెడ్డి (ఉప్పల్), బానోత్ మదన్‌లాల్ (వైరా)లకు కూడా కేసీఆర్ సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం.
ఇక మంత్రులు కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్‌నగర్), మల్లారెడ్డి (మేడ్చల్)లను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. పొత్తుల్లో భాగంగా సీపీఐకు మునుగోడు, భద్రాచలం సీపీఎంకు కేటాయిస్తారని చెబుతున్నారు. దీంతో, కేసీఆర్ ప్రకటించే జాబితా పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications