ప్రొఫెసర్ హరిగోపాల్ కేసుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..!!

ప్రొఫెసర్ హరగోపాల్ పై నమోదు చేసిన కేసుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌‌పై కేసు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హరగోపాల్ సహా ఇతరుల మీద పెట్టిన యూఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీ అంజనీకుమార్‌నుముఖ్యమంత్రి ఆదేశించారు. హరగోపాల్, లేట్ జస్టిస్ సురేష్, జర్నలిస్ పద్మజా షాలపై ఉపా కేసులు ఎత్తి వేయాలని కేసీఆర్ ఆదేశించారు. మిగితా వారికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

ప్రొఫెసర్‌ హరగోపాల్‌తోపాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులపై 2022, ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో దేశద్రోహం కేసు నమోదయింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నిందితులుగా ఉన్న వారిలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్‌, ప్రొఫెసర్‌ పద్మజా షా, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వీ రఘునాథ్‌, చిక్కుడు ప్రభాకర్‌ తదితరుల పేర్లున్నాయి. మొత్తం 152 మందిలో కేవలం ముగ్గురి మీద మాత్రమే కేసు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో, మిగిలిన వారి విషయంలో నిర్ణయం ఏంటనేది తెలియాల్సి ఉంది.

 haragopalkcr

నపై కేసు నమోదైన విషయంపై స్పందించిన సమయంలో హరగోపాల్‌ ఆ చర్యను పోలీసుల అత్యుత్సాహంగా వర్ణించారు. ప్రభుత్వ పెద్దలకు తెలిసి తనపై కేసు నమోదైందని అనుకోవడం లేదంటూ హరగోపాల్‌ చెప్పుకొచ్చారు. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళి బెయిల్ పిటిషన్ సందర్భంగా పోలీసులు ఈ కేసును బయటపెట్టారు. చంద్రమౌళిని రెండు నెలల కింద పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు.. బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోలీసులు తెలియజేశారు. మొత్తం అన్ని కేసుల వివరాలూ అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్‌ను ప్రస్తావించడంతో బయటపడింది.

నిందితులుగా ఉన్న వారిలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్‌ (జస్టిస్‌ సురేశ్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేనాటికే చనిపోయారు) ప్రొఫెసర్‌ పద్మజా షా, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వీ రఘునాథ్‌, చిక్కుడు ప్రభాకర్‌ తదితరుల పేర్లున్నాయి. హరగోపాల్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయటం పైన వామపక్ష నేతలతో పాటుగా ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్ వెంటనే హరగోపాల్‌పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డీజీపీని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+