సీఎం కేసీఆర్ నిమ్మకాయ ఇచ్చినా తీసుకోవద్దు: బీఆర్ఎస్ నాయకులకు బండి సంజయ్ షాకింగ్ సలహా!!
తెలంగాణా సీఎం కెసిఆర్ పై బండి సంజయ్ (bandi sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసిఆర్ చేసేవన్నీ తాంత్రిక పూజలేనని సంచలన వ్యాఖ్యలు చేసిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కెసిఆర్ అటువంటి క్షుద్ర పూజలలో ఆరితేరారు అని విమర్శించారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కరీంనగర్ లో మొక్కలు నాటిన బండి సంజయ్ అనంతరం బిజెపి ప్రచార రధాన్ని ప్రారంభించారు.
ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) పై విరుచుకుపడ్డారు. కెసిఆర్ ఇతర పార్టీలలోని నేతలను, తమ పార్టీలో చెబితే వినని నేతలను నాశనం చేయడం కోసం పవర్ఫుల్ తాంత్రికులను తీసుకువచ్చి పూజలు (occult worships) చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరూ కెసిఆర్ నిమ్మకాయ ఇచ్చినా తీసుకోవద్దన్నారు.

బొట్టు పెట్టిన, చేతికి కంకణం కట్టిన కట్టుకోవద్దని ఆ పార్టీ నేతలకు తాను సూచిస్తున్నా అని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యక్తిత్వమే అటువంటిదని పేర్కొన్న బండి సంజయ్, ఇతరుల నాశనం కోరుకునే వ్యక్తి కెసిఆర్ అంటూ ఆరోపించారు.
కెసిఆర్ ప్రకటించిన అభ్యర్థులలో సగం మందికి టికెట్ ఇవ్వడని, ఒకవేళ ఇచ్చినా వారిని ఓడించి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారిని మళ్లీ తెచ్చుకుంటారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ తో చెయ్యి కలిపితే జీవితాలు నాశనమవుతాయని, ఎమ్మెల్యే పదవి కంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం ముఖ్యం అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని, కాంగ్రెస్లో కులాల కొట్లాటను కేసీఆర్ పెట్టిస్తున్నారు అంటూ బండి సంజయ్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ (congress party)లో గెలిచిన వారంతా చివరికి కేసీఆర్ దగ్గరికి వెళ్తారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో యువత కేసీఆర్ ను క్షమించదని పేర్కొన్న బండి సంజయ్ ఉద్యోగాల పేరుతో మోసం చేసినందుకు కేసీఆర్ కు యువత బుద్ధి చెప్తుందని పేర్కొన్నారు. కెసిఆర్ ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని పూజలు చేసినా మళ్ళీ అధికారంలోకి రావడం మాత్రం సాధ్యం కాదని బండి సంజయ్ జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications