సెంటిమెంట్ కొనసాగించిన కేసీఆర్ - నామినేషన్ దాఖలు..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. గజ్వేల్ - కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ రెండు చోట్ల ఈ రోజునే నామినేషన్ దాఖలు చేసారు. అటు మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గం సిరిసిల్ల నుంచి నామినేషన్ వేసారు. ఈ రోజు మంచి ముహూర్తం కావటం..రేపటితో నామినేషన్ల సమయం ముగుస్తుండటంతో పెద్ద సంఖ్యలో నేతలు తరలి వస్తున్నారు. ఇక, కామారెడ్డిలో కేసీఆర్ పైన రేవంత్ పోటీ చేస్తుండటంతో పోరు ఆసక్తి కరంగా మారుతోంది.

నామినేషన్ల సందడి : గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న నామినేష‌న్ దాఖలు చేసారు. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను స‌మ‌ర్పించారు. ఎర్ర‌వ‌ల్లి నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో గ‌జ్వేల్‌కు వెళ్లారు కేసీఆర్. నామినేష‌న్ దాఖ‌లు అనంత‌రం గ‌జ్వేల్ నుంచి హెలికాప్ట‌ర్‌లో కామారెడ్డికి వెళ్లిన కేసీఆర్ తన రెండో నియోజకవర్గంగా అక్కడ నామినేషన్ వేస్తన్నారు.

CM KCR Files nomination form Gajwel, contesting for Two seats in present Elections

అనంత‌రం కామారెడ్డిలో నిర్వ‌హించే బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. కేసీఆర్ ప్ర‌సంగంపై ఆసక్తి కొనసాగుతోంది. కామారెడ్డి నుంచి తాను ఎందుకు పోటీ చేస్తున్నానో చెప్పటం తో పాటుగా స్థానికులకు సీఎం కేసీఆర్ కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉంది.

సెంటిమెంట్ కొనసాగిస్తూ : ఎన్నికల సమయంలో కేసీఆర్ తన సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో సీఎం కేసీఆర్ శ‌నివారం ప్రత్యేక పూజలు చేసారు. నామినేషన్‌ వేసే ముందు ప్రతిసారి సీఎం కేసీఆర్‌ కోనాయిపల్లి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

ఆలయంలో తొలుత ధ్వజస్తంభానికి మొక్కి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ పత్రాలను స్వామి వారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూజలు నిర్వహించి నామినేషన్‌ పత్రాలను అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి శాసనసభకు వేసే(రెండు సెట్లు) నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు.

సిరిసిల్లలో కేటీఆర్ : కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్‌ వేశారు.

అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు. 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్‌ఎస్‌ పార్టీని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అటు మంత్రి కేటీఆర్ తో సహా పలువురు మంత్రులు..కాంగ్రెస్, బీజేపీ ముఖ్యులు సైతం ఇదే రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కేసీఆర్ పైన కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రేపు (శుక్రవారం) నామినేష్ దాఖలు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+