టికెట్ల ఖరారు పై సీఎం కేసీఆర్ క్లారిటీ - ఎన్నికల టాస్క్ ఫిక్స్..!!
బిఅర్ఎస్ ప్రతినిధుల సభలో సిఎం కేసీఅర్ కీలక అంశాలను ప్రస్తావించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లు జాగ్రత్తగా పని చేసుకోవాలని సూచించారు. బాగా పని చేసుకుంటే మీకే టికెట్లు అని తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసారు.
ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు వస్తాయని, తాను చేయటానికి ఏమీ ఉండదని చెప్పారు. క్యాడర్ లో అసంత్రుప్తి తగ్గించే చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావటమే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేసారు.

100 సీట్లలో గెలుపు : తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచామని కేసీఆర్ గుర్తు చేసారు. వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తామని స్పషటం చేసారు. నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.
పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని నిర్దేశించారు. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసిందని చెప్పుకొచ్చారు. క్యాడర్ లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం తో పాటుగా ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలని స్పష్టం చేసారు.
అదే పెద్ద టాస్క్ : ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదని చెప్పిన కేసీఆర్, మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశమని తేల్చి చెప్పారు. ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్... బట్ బై చాయిస్ గా పేర్కొన్నారు. దూపయినప్పుడు బావి తవ్వుతం అనే రాజకీయం నేడు కాలానికి సరిపోదని చెప్పుకొచ్చారు.
బిఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టివి యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టవచ్చని సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టివి ఛానల్ ను కూడా నడపవచ్చని పేర్కొన్నారు. రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని వివరించారు. అదే పంథాలో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని చెప్పారు.
ఇంఛార్జ్ ల నియామకం : మన శాసనసభ్యులు లేని చోట జడ్పీ ఛైర్మన్లు, ఎంపీలు, జిల్లా ఇంచార్జిలుగా ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ 3,4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించారు. మన మంత్రులు పారదర్శకంగా పనిచేస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయన్నారు.
ఎపి తలసరి ఆదాయం రూ. 2,19,518. ఇది మనకన్నా లక్ష రూపాయలు తక్కువని చెప్పారు. ఇంతకన్నా తక్కువ రాష్ట్రాలు 16, 17 వున్నాయని వివరించారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం గురించి కేసీఆర్ ప్రస్తావించారు. ఇదే సమావేశంలో కీలక తీర్మానాలను సమావేశం ఆమోదించింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications