కేసీఆర్ రెడీ... జగన్‌తో అమీ తుమీ తేల్చుకునేందుకు... 'కౌన్సిల్' ముందుకు ఆధారాలతో సహా..

ఈ నెల 25న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలన్నింటినీ కౌన్సిల్‌లోనే నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ నదీ జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను సమావేశంలో లేవనెత్తుతామని వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సంసిద్దతను వ్యక్తం చేస్తూనే కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. సమావేశ అజెండాలో చేర్చాల్సిన అంశాలను అందులో పేర్కొననున్నారు.

వ్యూహం ఖరారు...

వ్యూహం ఖరారు...

అపెక్స్ కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం(అగస్టు 19) సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కొత్తగా ప్రాజెక్టులు చేపట్టలేదని... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రాజెక్టులనే రీడిజైన్ చేశామన్న అంశాన్ని కౌన్సిల్‌లో గట్టిగా వినిపించాలని కేసీఆర్ అన్నారు. కేంద్రం,ఏపీ సర్కార్ లేవనెత్తిన సందేహాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం,ఏపీ వాదనలు అర్థం పర్థం లేనివని కొట్టిపారేశారు.

ఆ వివరాలు సిద్దం చేయాలని...

ఆ వివరాలు సిద్దం చేయాలని...

తెలంగాణలో కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, తమ్మిడిహెట్టి, ఛనాకా-కొరటా, రాజంపేట, పింపార్డ్‌ ప్రాజెక్టులన్నీ కొత్తవేనని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని ఏపీ ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో... ఆధారాలతో సహా దీనికి బదులివ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఎన్ని నిధులు కేటాయించారు? తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? ఎన్ని టీఎంసీలు కేటాయించారు? తదితర వివరాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆధారాలతో సహా కౌన్సిల్ ముందుకు...

ఆధారాలతో సహా కౌన్సిల్ ముందుకు...

ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకు అనుగుణంగానే తెలంగాణ వ్యవహరిస్తున్నదనే విషయాన్ని ఆధారాలతో సహా కౌన్సిల్ ముందు పెట్టాలన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కౌన్సిల్ వేదికగా గట్టిగా అభ్యంతరం చెప్పాలన్నారు. ట్రిబ్యునల్ అవార్డు అనుమతులు లేకుండానే గోదావరి, కృష్ణా నదుల్లో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా వాడుకుంటున్న నీటి వాటాలపై కూడా నిలదీయాలని అధికారులతో చెప్పారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణకు జరుగతున్న అన్యాయాలపై గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేశామని, ఈ సారి జరిగే అపెక్స్ కౌన్సిల్‌లో అయినా ఆ అంశాలను చేర్చి న్యాయం చేయాల్సిందిగా కోరుతామని సీఎం చెప్పారు.

అమీ తుమీ..

అమీ తుమీ..

నిజానికి ఈ నెల 5వ తేదీనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ముందస్తు షెడ్యూల్ కారణంగా ఆరోజు సమావేశానికి హాజరుకాలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో సమావేశం వాయిదా పడింది. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేందుకు వీలు కల్పించడానికే కేసీఆర్ సమావేశాన్ని వాయిదా వేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. జగన్‌తో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక కౌన్సిల్ సమావేశానికి వెళ్తే ఏం లాభమని నిలదీశాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులపై జగన్ సర్కార్ దూకుడును కేసీఆర్ తీవ్ర స్వరంతో హెచ్చరించడం తెలిసిందే. పిలిచి అన్నం పెడితే కెలికి కయ్యం పెడుతారా అంటూ పరోక్షంగా జగన్‌పై విరుచుకుపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్,జగన్ మధ్య అమీ తుమీ తప్పేలా లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+