కేసీఆర్ ఎమోషనల్ అస్త్రం, కొత్త వరాలు- కాంగ్రెస్ అలర్ట్, "మూడ్" మార్చేనా..!!

తెలంగాణ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉన్నట్లు అంచనాలు పెరుగుతున్నాయి. 80 సీట్లు ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో గెలుపు తమదే అని చెబుతూనే..కేసీఆర్ ప్రచారం చివరి నిమిషంలో కొత్త అస్త్రాలు బయటకు తీస్తున్నారు. ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. సెంటిమెంట్ పండిస్తున్నారు.

కౌంట్ డౌన్ షురూ
తెలంగాణలో పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. కేవలం 48 గంటలు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో పార్టీలు మరింత దూకుడు పెంచనున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ మధ్య పోటీ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

CM KCR going emotional and Agressive in Election campaign, will it change the public mood

దీంతో, సీఎం కేసీఆర్ కొత్త అస్త్రాలు సంధిస్తున్నారు. ఎమోషనల్ ప్రసంగాలు ప్రారంభించారు. సెంటిమెంట్ పండిస్తున్నారు. కొత్త వరాలు ప్రకటిస్తున్నారు. దీంతో, కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఇప్పుడు కేసీఆర్ ప్రచారం చివరి రెండు రోజుల్లో చేస్తున్న ప్రసంగాలతో ఓటర్లతో ఎమోషనల్ అటాచ్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పబ్లిక్ మూడ్ ఈ ప్రసంగాలు మార్చుతాయా అనే చర్చ మొదలైంది.

కేసీఆర్ కొత్త అస్త్రాలు
పోలింగ్ కు కేవలం 45 గంటలే సమయం ఉంది. తాజాగా సీఎం కేసీఆర్ ప్రసంగంలో మార్పు కనిపిస్తోంది. తెలంగాణలో నాటి కష్టాలను గుర్తు చేస్తున్నారు. తాను తెలంగాణ కోసం చేసిన పోరాటం ప్రజల సమక్షంలో మననం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నామంటూ వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ తెచ్చిన కీర్తి కంటే తనకు ఏం కావాలని ప్రశ్నించారు. తన వయసు 70 ఏళ్లు అని..రెండు సార్లు ప్రజలు తనకు సీఎంగా అవకాశం ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. ఏ తెలుగు సీఎంకు దక్కని గౌరవం తనకు దక్కిందన్నారు. తనకు పదవుల పైన ఆశలు లేవని..అయితే, తెలంగాణ వంద శాతం అక్షరాస్యత..పేదరికం లేని రాష్ట్రంగా నిలబెట్టాలనేది తన లక్ష్యమని చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు.

ప్రజల మూడ్ మార్చేనా
ఈ రెండు రోజులు సీఎం కేసీఆర్ ప్రసంగాలు ఇదే తరహాలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు, రేపు రైతు బంధు కింద 70 లక్షల రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. అదే సమయంలో అసైన్డ్ రైతులకు ఆ భూముల పై పూర్తి హక్కులు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో సాగునీరు, విద్యుత్ విషయంలో తాను పడిన కష్టాన్ని వివరిస్తూ ఓటర్ల ఆలోచన తన వైపు మళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, కాంగ్రెస్ అప్రమత్తం అయింది.

ఓటమి ఖాయమని తెలిసే నిరాశలో ఈ రకంగా మాట్లాడుతున్నారని చెబుతోంది. అదే సమయంలో అధికారం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముందు ఈ రెండు రోజుల ప్రచారం..కేసీఆర్ ఎమోషనల్ ప్రసంగాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతాయా..ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనేది ఆప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+