ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం: త్యాగాలు స్మరించుకున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గురువారం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం వివిధ దశలో జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, తాగ్యాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
రాష్ట్ర సాధన పోరాట క్రమంలో ఎదురైన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలను అధిగమించిన అడ్డంకులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. స్వయం పాలనకు 9ఏళ్లు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి వెళ్తున్నామన్నారు సీఎం. అనుమానాలు పటాపంచలు చేస్తూ అద్భుతంగా నిలదొక్కుకున్నామన్నారు. ప్రత్యర్థుల కుయుక్తులు తిప్పికొడుతూ నిలదొక్కుకోవడం అత్యద్భుతమని చెప్పారు. శాంతియుత పద్ధతిలో పోరాటాన్ని కొనసాగించి రాష్ట్రాన్ని సాధించిన మొత్తం ప్రక్రియను, దీనికి సహకరించిన వారందర్నీ కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. తొమ్మిదేళ్లు నిలదొక్కుకున్న తీరు అద్భుతమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాడు వెనుకబాటుకు గురైన తెలంగాణ నేడు అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకుపోతోందని తెలిపారు. వెనుకబాటుతనానికి గురైన తెలంగాణ నేడు దేశాన్ని ముందుకుతీసుకెళ్తోందన్నారు. ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో విజయం సాధించామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలువడం సంతృప్తికరంగా ఉందన్నారు. 'తెలంగాణ మోడల్' పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, తెలంగాణ వంటి పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారన్నారు సీఎం కేసీఆర్. దేశ ప్రజలందరి ఆదరాభిమానాలు పొందడం మన ఘన విజయమని, ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమన్నారు. అన్నిరంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తూ మహోజ్వల స్థితికి చేరుకుంటున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాల పాటు అంగరంగ వైభవంగా జరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
Telangana Government is commemorating the State's unprecedented progress in a grand and befitting manner by way of Decennial Celebrations (Dashabdi Utsavalu). #TelanganaTurns10 #TelanganaFormationDay pic.twitter.com/U9hsKHxkYk
— Telangana CMO (@TelanganaCMO) June 1, 2023
కాగా, 21 రోజుల పాటు సాగే ఈ దశాబ్ధ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ విభిన్నమైన కార్యక్రమాలను ప్లాన్ చేసింది. జూన్ 2న హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించడంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించి, అక్కడ కొత్తగా నిర్మించిన అమరవీరుల స్మారక స్థూపాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక జిల్లాల్లో జరిగే వేడుకల్లో మంత్రులు పాల్గొననున్నారు.
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications