కేసీఆర్‌కి లెప్ట్, రైట్‌గా ఒవైసీ బ్ర‌ద‌ర్స్ .. తెలంగాణ స‌ర్కార్‌పై కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అప్పులుకుప్పగా మార్చిన కేసీఆర్‌తో నీతులు చెప్పించుకునే స్థాయిలో బీజేపీ లేదన్నారు. కేసీఆర్ తనకు కుడివైపు అసదుద్దీన్ ఒవైసీ, ఎడమవైపు అక్బరుద్దీన్ ఒవైసీని పెట్టుకుని చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు.

కేసీఆర్ పాల‌న‌కు చ‌మ‌ర‌గీతం..

కేసీఆర్ పాల‌న‌కు చ‌మ‌ర‌గీతం..

తెలంగాణలో మతపరమైన ఘర్షలు జరిగేలా కేసీఆర్ రెచ్చగొట్టే మాట‌లు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాశీ పునరుద్దరణపై విమర్శలు చేయడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ యజ్ఞాలు, యాగాలు చేయోచ్చు కానీ.. బీజేపీ మాత్రం చేయ‌కూడ‌దా.? అనిప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనకు కాలం చెల్లిందని విమర్శించారు. తెలంగాణ బిడ్డలు తమ పౌరుషాన్ని చూపించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు . వచ్చే ఎన్నికల్లో కల్వకుంట కుటుంబ పాలనకు ప్రజల చమరగీతం పాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనతో నాగలి కట్టేందుకు సిద్ధమా కేసీఆర్.. ?

తనతో నాగలి కట్టేందుకు సిద్ధమా కేసీఆర్.. ?

రాష్ట్రానికి కేసీఆర్ పెద్ద శని అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలులో రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో నాగలి కట్టేందుకు కేసీఆర్ సిద్ధమా ? అని ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కాదు.. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉందన్నారు. అసలు సమస్య అంతా బాయిల్డ్ రైస్‌తోనే అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు బాయిల్డ్ రైస్ తినడం లేదన్నారు. లేనిపోని మాయమాటలను చెప్పి రైతులను బయపెట్టొద్దని .. పంటమార్పిడి తాము సహకరిస్తామని తెలిపారు.

తెలంగాణ‌కి అండ‌గా కేంద్రం..

తెలంగాణ‌కి అండ‌గా కేంద్రం..

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్నివిదాల‌ సహకరిస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7వేల కోట్లతో శరవేగంగా రోడ్లను అభివృద్ధి చేస్తోంద‌న్నారు. భూసేకరణకు కేసీఆర్ ప్రభుత్వమే ఆలస్యం చేస్తుందని విమర్శించారు. మరో రూ 8,500 కోట్లతో 336 కి.మీ మేర రహదారులను చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం పెట్టపీట వేసిందన్నారు.

అభివృద్ధి చేయడం చేతకాదు కానీ.. కంటోన్మెంట్ కావాలా..

అభివృద్ధి చేయడం చేతకాదు కానీ.. కంటోన్మెంట్ కావాలా..

కేసీఆర్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. నగరంలో రోడ్లు అద్వానంగా తయారయ్యాయని విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న జీహెచ్‌ఎంసీని అప్పుల మయంగా చేసింద‌న్నారు. అధికారులకు, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నవాటిని అభివృద్ధి చేయడం చేతకాదు కానీ.. కంటోన్మెంట్ కావాలంటున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+