కాంగ్రెస్ వస్తే.. నమలకుండా మింగేస్తారు: నాగర్‌కర్నూల్ సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

మహబూబ్‌నగర్: కాంగ్రెస్ రాజ్యంలో దళారులదే భోజ్యం అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. నాగర్ కర్నూల్‌లో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. ఇది మహబూబ్‌నగర్ జిల్లా కీర్తికిరీటంలో శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు.

తెలంగాణ మోడ‌ల్ మాకు కావాల‌ని దేశ‌మంతా కోరుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. అనేక స‌భ‌ల్లో దేశ ర‌మ్మంటుంది.. పోవాల్నా అంటే పో బిడ్డా మేం ఆశీర్వ‌దిస్తాం అని మీరంతా చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌లే నా బ‌లగం.. నా బంధువులు మీ ధైర్యంతోనే నిర్ణ‌యాలు తీసుకొని ముందుకు పోతున్నాను అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డితే తెలంగాణ చిమ్మ చీక‌టి అయిత‌ద‌ని నాడు ఆంధ్రా నాయ‌కులు శాపం పెట్టార‌ని కేసీఆర్ గుర్తు చేశారు. ఇవాళ తెలంగాణ వెలుగుజిలుగుల‌తో మెరిసిపోతోందన్నారు.

CM KCR

దేశంలో ఎక్క‌డా కూడా ఇంత మంచిగా క‌రెంట్ లేదు. గిరిజ‌నుల‌కు పోడు భూములు పంచుకుంటుంన్నాం. పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద నార్లాపూర్, ఏదుల‌, వ‌ట్టెం, క‌రివెన‌, ఉద్ధండ‌పూర్ రిజ‌ర్వాయ‌ర్లు నిండాయంటే పాల‌మూరు బంగారు తున‌క అవుతుంది. బ్ర‌హ్మాండ‌మైన పంట‌లు పండిస్తారు. వీటిని పూర్తి చేసి పాల‌మూరుకు వంద శాతం నీళ్లు ఇస్తాం. మ‌ళ్లీ ఒక్క‌సారి మిమ్మ‌ల్ని అడుగుతున్నాను. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఉండాల్నా..? తీసేద్దామా..? ధ‌ర‌ణిని త‌ప్ప‌కుండా ఉంచుదాం. ఎవ‌డైతే బంగాళాఖాతంలో వేద్దాం అన్నాడో వాన్నే బంగాళాఖాతంలో వేద్దాం. ముందుకు పోదాం. ధ‌ర‌ణిలో స‌మ‌స్య‌లు ఉంటే అధికారుల‌కు, ఎమ్మెల్యేల‌కు చెప్పండి. మంత్రుల‌కు చెప్పండి.. నిమిషాల మీద ప‌రిష్కారం చేస్తారన్నారు సీఎం కేసీఆర్.

ఇక, గృహ‌ల‌క్ష్మి కింద నియోజ‌క‌వ‌ర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీగా ఉండి తెలంగాణ సాధించాను కాబ‌ట్టి.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు 4 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. వృత్తిప‌ని వారు ఉన్నారు.. బీసీ కులాల్లో ఉన్న‌వారిని ఆదుకోవ‌డానికి కుటుంబానికి ల‌క్ష సాయం చేస్తున్నామని సీఎం తెలిపారు. జూన్ 9 నుంచి ప్రారంభించ‌బోతున్నామన్నారు. ఈ విధంగా మాన‌వీయ పాల‌న కొన‌సాగిస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. కులం లేదు జాతి లేదు. అంద‌రూ మ‌న‌వాళ్లే. అంద‌రూ చ‌ల్ల‌గా బ‌త‌కాలి. ఈ ప‌థ‌కాల గురించి ఒక్క‌డైనా ఆలోచించారా? అని ప్రశ్నించాచరు.

కంటి వెలుగు కార్య‌క్ర‌మం ద్వారా ల‌క్ష‌లాది మందికి ఉచితంగా అద్దాలు ఇస్తున్నాం. ఒంట‌రి మ‌హిళ‌లు ఉన్నారు.. వారి గురించి ఎవ‌రైనా ఆలోచించారా..? బీడీ కార్మికుల‌కు ఒక్క‌డైనా రూపాయి ఇచ్చారా..? ఇవ‌న్నీ కూడా చాలా మేదోమ‌థ‌నం నుంచి వ‌చ్చాయి. అద్భుత‌మైన మాన‌వీయ కోణంలో ప‌ని చేస్తున్నాం. ఇది రైతులు, గిరిజ‌నులు, ద‌ళితుల ప్ర‌భుత్వం అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ రాజ్యంలో దళారులదే భోజ్యం. పైరవీకారులదే రాజ్యం. మళ్లీ మనల్ని మింగేయడానికి చెబుతున్నారు. వారి మాటలు నమ్మొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. దరణి వద్దంటూ.. మళ్లీ రైతులను పోలీస్ స్టేషన్ల చుట్టూ.. కోర్టుల చుట్టూ తిప్పేలా కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. నమ్మి అధికారమిస్తే పంటికి అంటకుండా మింగేయడానికి సిద్ధంగా ఉన్నారనీ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+