Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ కు భక్తి ఎక్కవ - దేవుడి వద్ద కలిసి పని చేయాలి : అమిత్ షా సమక్షంలో చినజీయర్..!!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంప్రదాయ దుస్తుల్లో.. తిరునామాలు ధరించి సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. ఆయనకు చినజీయర్ స్వామి ఆలయ ప్రత్యేకతలు...నిర్మాణ విశిష్ఠతను వివరించారు. ఆ సమయంలోనే చినజీయర్ స్వామి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అమిత్ షా సమక్షంలో సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు. ప్రధాని మోదీ సమతామూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. జ్వరం కారణంగా ప్రధాని స్వాగత - వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొన లేదని అధికార వర్గాల సమాచారం.

విభేదాలు ఉన్నా కలిసి పని చేయాలి

విభేదాలు ఉన్నా కలిసి పని చేయాలి

అయితే, ఇప్పుడు అమిత్ షా సమక్షంలో ప్రసంగిస్తూ చిన జీయర్ స్వామి కేసీఆర్ కేసీఆర్‌ కూడా శ్రీవైష్ణవుడేనని, ఆయనకు భక్తికూడా ఎక్కువేనని పేర్కొన్నారు. సమతామూర్తి దివ్యక్షేత్రం పనులకు ఆరంభం నుంచి సీఎం కేసీఆర్‌, ఆయన ప్రభుత్వం అనేక సహాయ సహకారాలు అందించినట్టు తెలిపారు. రాజకీయ పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ భగవంతుని కార్యక్రమాలు, సేవ విషయంలో కలిసి పనిచేయాలని హితవు పలికారు. భక్తిమార్గంలో ఉన్న వారందరూ కలిసిమెలసి ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ.. హోంమంత్రి అమిత్‌షా దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకువెళుతున్నారని కొనియాడారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తరువాత అంతటి సమర్థ నేత అమిత్‌షా అని మైహోం రామేశ్వరరావు ప్రశంసించారు.

చినజీయర్ తో పరిచయం అలా

చినజీయర్ తో పరిచయం అలా

ఇదే సమయంలో ప్రసంగించిన అమిత్ షా.. తాను జన్మతః వైష్ణవుడినని.. తన తల్లి వల్లభాచార్య సిద్ధాంతాలపైనే జీవితాన్ని గడిపారని తెలిపారు. రామానుజాచార్యులు రచించిన తొమ్మిది గ్రంథాలు చదివానన్నారు. ధర్మం, సమాజం కోసం ఏదైనా చేయాలన్న తపన ఉన్న చినజీయర్‌ స్వామి కృషి యుగాల వరకూ సమాజానికి స్ఫూర్తి నింపుతుందన్నారు. 2003లో గుజరాత్‌లో భూకంపం వచ్చినప్పుడు చినజీయర్‌ స్వామితో పరిచయం కలిగిందని అమిత్‌ షా చెప్పారు. ఎలాంటి అర్భాటం లేకుండా ఒక గ్రామంలో కూర్చుని భూకంప బాధితుల కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాకే ఆయన తిరిగి వెళ్లారని గుర్తు చేసారు.

చిన జీయర్ స్వామిపై షా ప్రశంసలు

చిన జీయర్ స్వామిపై షా ప్రశంసలు

ఇప్పుడు కూడా సమతామూర్తి విగ్రహ ఏర్పాటును విజయవంతంగా పూర్తిచేశారని ప్రశంసించారు. ఆయన చేపట్టిన కార్యం ఏదైనా విజయవంతగా ముగిస్తారంటూ అభినందించారు. భవ్యమైన రామమందిర పునర్నిర్మాణం, 650 సంవత్సరాల తర్వాత కాశీ విశ్వనాథ్‌కారిడార్‌, కేదార్‌ధామ్‌, బదరీధామ్‌ పునర్నిర్మాణం లాంటివి జరగడం విధి, విధాత ఇచ్చిన ఆశీర్వాదమని అమిత్ షా చెప్పుకొచ్చారు. రామానుజాచార్యుల జీవితమే ఓ సందేశమని.. అందరూ సమానులే అని వెయ్యేళ్ల క్రితమే ఆయన చాటారని.. ఆలయ ప్రవేశంలో అందరికీ సమాన హక్కు ఉందని చెప్పడమే కాకుండా సంపూర్ణంగా అమలుచేసిన మహనీయుడు రామానుజాచార్యులని షా వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+