Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

21 రోజులపాటు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) నిర్ణయించారు. శనివారం ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమైన సీఎం.. వేడుకల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. 21 రోజులపాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి ఆధ్వర్యంలో ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు.

పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ.. పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా, ఘనంగా జరుపుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సిఎం సూచించారు.

CM KCR key orders on telangana state formation day celebrations held from june-2

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖు నుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని సిఎం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాష్ట్ర మంత్రులు, వారి వారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విధివిధానాలపై శనివారం నాడు సచివాలయంలోని సిఎం సమావేశమందిరంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

'తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 2023 జూన్ 2వ తేదీ నాటికి, తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. పెద్ద ఎత్తున పోరాటాలు, ఎన్నో కష్టాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అతిపిన్న వయస్సుగల రాష్ట్రం. అయినా కూడా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో, సమిష్టి కృషితో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుతంగా ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. నేడు తెలంగాణ దేశానికే వొక రోల్ మోడల్ గా మారింది' అని వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్.

'మన ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల వాల్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు మన రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్యపోతున్నారు. వారికి వొక దశలో నమ్మశక్యంగా అనిపించని తీరుగా మనం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని నమోదుచేసుకుంటున్నం' అని సీఎం కేసీఆర్ అన్నారు.

CM KCR key orders on telangana state formation day celebrations held from june-2

అభివృద్ధిని సాధించడమే కాకుండా సాధించిన అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందేలా చూడడంలో దార్శనికతను ప్రదర్శించాల్సి వుంటుందని సిఎం తెలిపారు. అప్పుడే ప్రగతి ప్రస్థానం ఆగకుండా కొనసాగుతుందని తెలంగాణలో అదే జరుగుతున్నదని సిఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణ పట్ల నిర్దిష్ట దృక్పథం, దూరదృష్టితో కూడిన సునిశిత కార్యాచరణ కొరవడిందని సిఎం తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దార్శనికతతో కూడుకుని వున్నదనడానికి తొమ్మిదేండ్ల అనతికాలంలో సాధించిన ప్రగతి సాక్ష్యంగా నిలిచిందని సిఎం తెలిపారు. పేరుకు తొమ్మిదేండ్లు అయినా, మొదటి సంవత్సరంతో పాటు, కరోనా కాలపు మరో రెండేండ్లు కలిపి దాదాపు మూడేండ్ల కాలం వృథాగానే పోయిన నేపథ్యంలో కేవలం ఆరేండ్ల కాలంలోనే తెలంగాణ ఇంతటి అద్భుత ప్రగతిని సాధించడం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+