కరోనాను మించిన వైరస్, సిద్దంగా ఉన్నాం - సీఎం కేసీఆర్..!!
రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌లు వస్తాయని నిపుణులు చెప్పారని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు వైద్యరంగం బలంగా ఉన్న చోట తక్కువ నష్టంతో బయటపడుతారని చెప్పినట్లుగా వివరించారు. అందుకే వైద్యరంగాన్ని రాష్ట్రంలో బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. నిమ్స్‌లో కొత్తగా నిర్మించే దశాబ్ధి బ్లాకుకు, విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మాట్లాడుతూ..వైద్యానికి, మానవజీవితానికి ఎడతెగని బంధం ఉన్నట్లు పేర్కొన్నారు.
నిమ్స్‌లో కొత్తగా1571 కోట్ల రూపాయలతో ప్రస్తుత భవనానికి ఆనుకొని ఉన్న 32 ఎకరాల స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో 2000 పడకలు ఉండనున్నాయి. ఈ కొత్త భవనంలో ఔట్ పేషెంట్, ఎమర్జెన్సీ వైద్యం కోసం ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేయనున్నారు. 32 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 6 మేజర్ మాడ్యులర్ థియేటర్లు దీనిలో నిర్మించనున్నారు. మొత్తం మూడు బ్లాకులలో నిమ్స్ టవర్ నిర్మించనున్నారు. వీటికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసారు. తెలంగాణ వచ్చాక ఆరోగ్యశాఖ అతికీలకమైనదిగా భావించామని తెలిపారు. 2014లో వైద్యరంగానికి బడ్జెట్‌లో రూ.2001 కోట్లు కేటాయించామని, 2023-24 నాటికి అది రూ.12,367 కోట్లకు చేరిందని వెల్లడించారు.

వైద్యారోగ్యశాఖకు సహజంగా విమర్శలే ఎక్కువగా ఉంటాయని, ప్రశంసలు తక్కువని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ప్రభుత్వ దవాఖానల్లో సామర్థ్యానికి మించి రోగులు వచ్చినా డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని తెలిపారు. మూరుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక సౌకర్యాలు అందిస్తున్నామని వెల్లడించారు. గతంలో దవాఖానల్లో 30 శాతం డెలివెరీలు జరిగేవని, ఇప్పుడు 70 శాతానికి పెరిగాయన్నారు. గతంలో ఉస్మానియా, గాంధీ, నోలోఫర్ వంటి దవాఖానలే దిక్కని, ఇప్పుడు వరంగల్‌లో ప్రపంచంలో లేని అద్భుతమైన హెల్త్ సిటీని కడుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో మరో నాలుగు హాస్పిటళ్లు కడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో గాంధీ దవాఖాన అద్భుతమైన సేవలు అందించిందని ప్రశంసించారు. ప్రైవేటు హాస్పిటళ్లు చేతులెత్తేసినా కరోనా రోగులను గాంధీ వైద్యులు కాపాడారని సీఎం కేసీఆర్ గుర్తు చేసారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications