నుమాయిష్‌లో కొలువుదీరిన స్టాళ్లు(పిక్చర్స్)
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) స్థలాన్ని ఢిల్లీలోని ప్రగతి మైదానం కంటే అపురూపంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రతి యేటా నుమాయిష్ నిర్వహిస్తూ దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులకు నగరాన్ని వేదిక చేయటంతో పాటు ప్రతిష్టాత్మకమైన ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రశంసించారు.
75వ అఖిల భారత నుమాయష్ ప్రదర్శనను ఆయన గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిస్వార్థంగా, సమాజ సేవ చేస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీకి నిజాం స్థలం ఇస్తే దాన్ని ప్రభుత్వాలు లీజుకివ్వడం సిగ్గు చేటని అన్నారు. సోషల్ కాజ్ కోసం పని చేస్తున్న సొసైటీకే ఈ స్థలాన్ని నాలుగు రోజుల్లో పట్టా ఇచ్చేస్తామని చెప్పారు. ఇక సొసైటీ లెస్సీ, కాదు పట్టాహోల్డర్ అని సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారు.
అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ సొసైటీ తెలంగాణ విద్యార్థులకు విద్యనందిస్తుందన్నారు. అనాధపిల్లలకు ఎగ్జిబిషన్ సొసైటీ రూ. 4 కోట్లతో స్కూల్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపి కె. కేశవరావు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న మంత్రి ఈటెల
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) స్థలాన్ని ఢిల్లీలోని ప్రగతి మైదానం కంటే అపురూపంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

నుమాయిష్
ప్రతి యేటా నుమాయిష్ నిర్వహిస్తూ దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులకు నగరాన్ని వేదిక చేయటంతో పాటు ప్రతిష్టాత్మకమైన ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రశంసించారు.

నుమాయిష్
75వ అఖిల భారత నుమాయష్ ప్రదర్శనను ఆయన గురువారం సాయంత్రం ప్రారంభించారు.

నుమాయిష్
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఎగ్జిబిషన్ స్థలాన్ని లీజులకు ఇవ్వడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. నిస్వార్థంగా, సమాజ సేవ చేస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీకి నిజాం స్థలం ఇస్తే దాన్ని ప్రభుత్వాలు లీజుకివ్వడం సిగ్గు చేటని అన్నారు.

నుమాయిష్ స్టాళ్లు
సోషల్ కాజ్ కోసం పని చేస్తున్న సొసైటీకే ఈ స్థలాన్ని నాలుగు రోజుల్లో పట్టా ఇచ్చేస్తామని చెప్పారు. ఇక సొసైటీ లెస్సీ, కాదు పట్టాహోల్డర్ అని సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారు.

నుమాయిష్
మొట్ట మొదటి సారిగా 1938లో పబ్లిక్‌గార్డెన్స్‌లో కేవలం ఆరు స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ నుమాయిష్ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్నారు.

నుమాయిష్
ప్రతి ఏటా తాను కూడా నుమాయిష్‌కు వస్తూ ఉండేవాడినని తెలిపారు. జంటనగరాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కార్యచరణను సిద్ధం చేస్తున్నట్లు సిఎం వెల్లడించారు.

నుమాయిష్
గత పాలకుల నిర్వాకం కారణంగా హైదరాబాద్ నగరం అన్ని రకాలుగా వెనకబడి పోయిందని, ఇందుకు రోజురోజుకీ తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యే ఓ కారణమని తెలిపారు.

నుమాయిష్
నగరంలో ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలంటే, మూడు నిమిషాలు హాజరుకావల్సిన ఫంక్షన్ కోసం రోడ్లపై మూడు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవల్సిన పరిస్థితి నెలకొందని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు.

నుమాయిష్
ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు, గవర్నర్ రాజభవన్ ముందు కూడా వర్షపునీరు నిలిచి చిన్నసైజు చెరువులను తలపిస్తున్నాయంటే నగరంలో మౌలిక వసతుల పరిస్థితి ఎలా ఉందో అంచనా వేసుకోవచ్చునన్నారు.

నుమాయిష్
అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ సొసైటీ తెలంగాణ విద్యార్థులకు విద్యనందిస్తుందన్నారు.

నుమాయిష్
అనాధపిల్లలకు ఎగ్జిబిషన్ సొసైటీ రూ. 4 కోట్లతో స్కూల్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు.

నుమాయిష్
ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపి కె. కేశవరావు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications