Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శాంతి భద్రతలపై కేసీఆర్ సమీక్ష: పోలీసుల వలయంలో పాతబస్తీ, దుకాణాలు బంద్

హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌​లోని ప్రగతిభవన్‌​లో ప్రస్తుత పరిణామాలపై సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చ్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై హైదరాబాద్ నగరం​లో రెండో రోజు నిరసనలు కొనసాగాయి. అలాగే బండి సంజయ్ అరెస్ట్​ నేపథ్యంలో బీజేపీ పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది.

శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ ఆరా

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఈ సమీక్షలో నగరంలోని మూడు కమిషనరేట్ల సీపీలు కూడా హాజరయ్యారు. మరోవైపు పాతబస్తీలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా యాక్షన్ ఫోర్స్ బలగాలను దించారు. మీర్‌చౌక్, గోషామహల్, చార్మినార్‌ జోన్ల పరిధిలో పహారా ఏర్పాటు చేశారు. మూడు ఏసీపీ జోన్ల పరిధిలో 360 మంది ఆర్‌ఎఎఫ్ జవాన్లతో పహారా కాస్తున్నారు.

పాతబస్తీ ప్రాంతంలో పోలీసుల మోహరింపు

పాతబస్తీ ప్రాంతంలో పోలీసుల మోహరింపు

కాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యలో పాతబస్తీలో నిరసనలు కొనసాగుతున్నాయి. రాజా సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ ఓ వర్గం పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఆందోళనలు కొనసాగిస్తోంది. చార్మినార్, మదీన, చాంద్రయాణగుట్ట, బార్కాస్, సిటీ కాలేజ్, మొజంజాహీ మార్కెట్ తదితర ప్ారంతాల్లో వందల మంది రోడ్లపైకి వచ్చి రాజా సింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఆయా ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.క్రై డిపార్ట్‌మెంట్ అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ పరిస్తితిని పర్యవేక్షించారు. ఆందోళనకు దిగిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ర్యాలీలకు, ధర్నాలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసుల వలయం

శాలిబండ ఆందోళనల నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. మీర్‌చౌక్, చార్మినార్, గోషామహల్ జోన్ల పరిధిలో మొత్తం 300లకుపైగా ఆర్ఏఎఫ్ బలగాలు మోహరించాయి. ప్రస్తుతం పాతబస్తీ ప్రాంతం మొత్తం పోలీసుల భద్రతా వలయంలో ఉంది. పాతబస్తీ ప్రాంతంలో రాత్రి ఏడు గంటల నుంచే దుకాణాలు మూసివేయించారు. రాజా సింగ్ నివాసాన్ని మంగళవారం రాత్రి కొందరు ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలోనూ పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ఆందోళనల నేపథ్పయంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ మహమూద్ అలీ

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ మహమూద్ అలీ

రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై హోం మంత్రి మహమూద్ అలీ స్పందిచారు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంభిస్తోందన్నారు. ఇతర మతాల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడి తద్వారా అశాంతిని సృష్టించాలనుకునే వారిని తెలంగాణ ప్రభుత్వం సహించదని స్పప్టం చేశారు. ఎమ్మెల్యే రాజా సింగ్‌పై హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. చట్టానికి జాతి, మత, కుల, వర్గ ఇతర భేదాలు ఉండవని... చట్టానికి ఎవ్వరూ అతీతులు కారని స్పష్టం చేశారు. మతాలకు వ్యతిరేకంగా ఎలాంటి అవాస్తవాలను, తక్కువ చేసి మాట్లాడడం వంటివి చేస్తే సహించమని హెచ్చరించారు. ఎవ్వరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. ప్రజలు అందరూ సంయమనంతో, సోదరభావంతో ఉండాలని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+