ఎమ్మెల్యేలకు ఆఫీస్‌లు, ఇంకోటి కావాలి: కెసిఆర్, టిడిపి నేత హెచ్చరిక

హైదరాబాద్: ఏడాదిలోగా నియోజకవర్గాలలో శాసన సభ్యులకు కార్యాలయాలు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. రహదారులు, భవనాల శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలపై సిఎం కెసిఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... అర్‌ అండ్ బీ శాఖ నిర్మాణాలు భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడాలన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల రహదారులు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరసల రహదారులుండాలన్నారు.

Also Read: కెసిఆర్‌కు లేఖ రాసి నిధులు తెచ్చుకున్న 10వ తరగతి విద్యార్థి

CM KCR review on Road and Buildings in Telangana

ప్రతి గ్రామానికి మంచి రహదారి ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లో హెచ్‌ఐసిసి తరహాలో మరో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభాపతి, మండలి ఛైర్మన్‌తోపాటు అధికారులందరికీ నివాసాలు ఉండాలన్నారు.

నివాస గృహాలు, క్వార్టర్ల నిర్మాణం కోసం సీఎస్‌ అధ్యక్షతన అరుగురితో కమిటీ వేయనున్నట్లు చెప్పారు. ఎన్జీఆర్ స్టేడియంలో నిర్మించ తలపెట్టిన కళాభారతిని కన్వెన్షన్ సెంటర్‌గా తీర్చిదిద్దాలన్నారు. కళాభారతి సభలు, సమావేశాలకు అనువుగా ఉండాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తాం: లక్ష్మారెడ్డి

ఎంసిఆర్‌హెచ్‌ఆర్డీలో మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో వైద్య విధానంపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, షకీల్ హాజరయ్యారు. మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ... నిజామాబాద్ జిల్లాలో కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు తీర్చిదిద్దుతామన్నారు.

వరంగల్‌లో 58 డివిజన్లు మావే: కడియం

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ తెరాస ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశమైంది. ఎన్నికల సమన్వయం, అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడారు.

అందరి సహాకారంతో మేడారం జాతర విజయవంతమైందన్నారు. గ్రేటర్ వరంగల్‌లో నీటి ఎద్దడిని నివారణకు గోదావరి నది నుంచి దేవాదుల ద్వారా నీటి లిఫ్ట్ చేయాలని సీఎం నిర్ణయించారన్నారు. వరంగల్‌లో 58 డివిజన్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. వరంగల్‌పై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు.

కయ్యానికి కాలు దువ్వితే సహించం: రేవంత్ రెడ్డి

కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరులో రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కెసిఆర్ దత్తత గ్రామంలో ఇళ్లు కోల్పోయిన వారికి యుద్ధ ప్రాతిపదికన ఇళ్లు నిర్మించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలన్నారు. లేదంటే అసెంబ్లీని స్తంభింప చేస్తామన్నారు. అభివృద్ధికి అండగా ఉంటామని, కయ్యానికి కాలు దువ్వితే మాత్రం సహించేది లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+