ఏపీలో పరిస్థితులపై కేసీఆర్ పరోక్ష వ్యాఖ్యలు: గద్వాల జిల్లాకు వరాలు, ఏమన్నారంటే?
మహబూబ్‌నగర్: జోగులాంబ గద్వాల జిల్లాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారల జల్లు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అయిజ రోడ్డులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరులో గతంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు దొరికేదని.. ఇప్పుడు మిషన్ భగీరథతో ఇంటి వద్దకే తాగునీరు అందిస్తున్నామని చెప్పారు.

మీకు కరెంటు రాదు.. తెలంగాణ చీకటిమయం అవుతుందని కొందరు మాట్లాడారు. ఇక్కడకు ఆంధ్ర కేవలం 25 కిలోమీటర్ల దూరమే. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్‌కి ఎంత తేడా ఉందో మీరే చూడండి. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉంటే.. తుంగభద్రకు అటువైపు కరెంటు కోతలే ఉన్నాయి అని కేసీఆర్ అన్నారు.
గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు.. 12 మండలాలు.. నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ఇది వరకు ఇక్కడకు రాలేదు. తొలిసారి వచ్చిన కాబట్టి.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రూ. 10 లక్షల చొప్పున ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేస్తున్నాం. దీంతో బాగా చేసుకోవాలని కోరుతున్నాను. మండల కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ప్రతి మండల కేంద్రానికి రూ. 15 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నాను.
గద్వాల మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ. 50 కోట్లు, మిగిలిన మూడు మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాను. ఈ నిధులతో మున్సిపాలిటీలు బాగుపడాలి. అద్భుతమైన పనులు జరగాలి. ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వాటన్నింటిని మనం సాధించుకుందాం. గట్టు ఎత్తిపోతల పథకాన్ని, అలంపూర్‌లో ఆర్డీఎస్‌కు కొనసాగింపుగా ఉన్న మల్లమ్మ కుంట పథకాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని మనవి చేస్తున్నాను అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఏనాడూ ప్రజల గురించి ఆలోచించని కొందరు వ్యక్తులు ధరణీని తీసేస్తామని.. బంగాళాఖాతంలో కలిపేస్తామని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ధరని కారణంగా రైతు బంధు నగదు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి. అనుకోకుండా ఒక రైతు మరణిస్తే బీమా సొమ్ము రూ. 5 లక్షలు పది రోజుల్లోనే వారి బ్యాంక్ ఖతాలో జమ అవుతున్నాయి.
పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మూడేళ్లు ఎంతో కష్టపడి ధరణిని తీసుకొస్తే.. కాంగ్రెస్ పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది ధరణిని బంగాళాఖాతంలో వేయడమా? లేదా ప్రజలను బంగాళాఖాతంలో వేయడమా? ప్రజలు ఆలోచించుకోవాలి. మీరు ధరణి కావాలంటున్నారు. కొన్ని పార్టీలు వద్దంటున్నాయి. ధరణి ఉండాలా? వద్దా? మీరే చెప్పండి. ధరణి వద్దనే వాళ్లకు మీరే సమాధానం చెప్పాలి. 24 గంటల నిరంతర విద్యుత్, రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ బీఆర్ఎస్‌నే గెలిపించాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Live: CM Sri KCR inaugurating Jogulamba Gadwal District Integrated Offices' Complex. https://t.co/V9WbKy6w1A
— Telangana CMO (@TelanganaCMO) June 12, 2023
అంతకుముందు గద్వాల సమీకృత భవన ప్రారంభోత్సవంలో కేసీఆర్ మాట్లాడుతూ.. గట్టు ఎత్తిపోతల పూర్తయితే గద్వాల వజ్రపు, బంగారు తునక అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. గద్వాల జిల్లాకు మెడికల్ కాలేజీ కూడా రాబోతుందని కేసీఆర్ తెలిపారు. గద్వాల జిల్లా పరిపాలన భవనం తన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేసీఆర్ తెలిపారు. హృదయపూర్వకంగా జిల్లా ప్రజాప్రతినిధులను, ఉద్యోగులను, ప్రజలను అభినందిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రోజు దేశంలో తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉందన్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications