తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - రైతులతో కలిసి ధర్నా : బీజేపీని కధ తేలుస్తా - సీఎం కేసీఆర్..!!
తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 78 వేల ఉద్యోగాలు ఇస్తాం అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉద్యోగాల విషయంలో పారద్శకంగా ఉంటామని, ఇకపై ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. పండించిన వరి ధాన్యం కొనేలా కేంద్రంపై వత్తి తెస్తామని, రైతులతో కలిసి ధర్నాకు దిగుతామని కేసీఆర్ అన్నారు. వచ్చే శుక్రవారం అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో ధర్నాలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ధర్నాలకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.

కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదంటూ
తెలంగాణలో పండే ధాన్యాన్ని పూర్తిగా కొనేవరకు వదిలిపెట్టమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంపై యుద్దానికి సీఎం యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. రైతులతో కలిసి ధర్నాలకు పిలుపునిచ్చారు. వచ్చే శుక్రవారం అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు సీఎం పిలుపునిచ్చారు. రైతులు వేలాదిగా తరలి రావాలని కోరారు. బీజేపీ నాయకులు ఎక్కడ కనిపించినా.. ధాన్యం కొంటారో, లేదో నిలదీయాలన్నారు. సీలేరు ప్రాజెక్టు ఆంధ్రాకు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజలకు ప్రధాని తీవ్ర అన్యాయం చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. '

కేంద్రంపై రైతులతో కలిసి నిరసన
మాతో కలిసి ధర్మాకు కూర్చుంటావా' అంటూ బండి సంజయ్ సీఎంను ప్రశ్నించారు. ఇకపై కేంద్రాన్ని వదిలిపెట్టమని.. వెంటాడతాం, వేటాడతాం.. ఎక్కడిదాకా అయినా పోతాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. పంజాబ్‌లో ధాన్యం కొంటున్నట్లు.. తెలంగాణలో కొంటారో, లేదో తేల్చి చెప్పాలన్నారు. ప్రపంచంలో పెద్ద సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తెలంగాణలో ఉన్నాయని.. సీడ్ కంపెనీతో టై అప్ ఉన్న రైతులు ధాన్యం వేసుకోవచ్చని సీఎం చెప్పారు. మిల్లర్లు, వ్యాపారుస్తుల నుంచి హామి ఉన్న రైతులు, ఒక రూపాయి తక్కువకైనా అమ్ముకుంటాం అనుకున్నవారు కూడా పంట వేసుకోవచ్చన్నారు. డీజిల్ మీద, పెట్రోల్ మీద సెస్ కేంద్ర విత్ డ్రా చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగం చేసి.. ఏమైనా కేసులు పెట్టాలనుకున్నా.. తాము దేనికీ భయపడమని సీఎం స్పష్టం చేశారు.
Recommended Video

బండి సంజయ్ కు వార్నింగ్
రాష్ట్రంలో హనుమాన్ గుడి లేని ఊరు.. టీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని సీఎం అన్నారు. దేశంలో పాలనా తీరు పైన ముఖ్యమంత్రి మండి పడ్డారు. ఖచ్చితంగా దేశ పాలనా తీరులో మార్పు రావాలని ఆకాంక్షించారు. దేశంలో పాలసీలు అన్నీ చెత్తగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. తాను చైనా మన దేశంలో ఆక్రమణలకు పాల్పడుతోందని చెబితే దేశ ద్రోహం అవుతుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. అయితే, ఇప్పుడు రైతులతో కలిసి అధికార పార్టీనే ధర్నాకు దిగటం ద్వారా బీజేపీని ఆత్మరక్షణలోకి పడేసే వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా బీజేపీ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications