ఆ విషయంలో నేను ఫెయిలయ్యానన్న కేసీఆర్, గుర్తు చేసినందుకు రాజాసింగ్‌కు థ్యాంక్స్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం థ్యాంక్స్ చెప్పారు. తాను ఫెయిలయ్యానని, తనకు ఈ విషయం గుర్తు చేసినందుకు రాజాసింగ్‌కు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
గవర్నర్ ప్రసంగంపై చర్చ, తీర్మానం సందర్భంగా రాజాసింగ్ అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన పలు సమస్యలను సృషించారు. లా అండ్ ఆర్డర్, బెట్టింగ్, డబుల్ బెడ్రూం, నేరాలు తదితర అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా దూల్‌పేట అంశాన్ని ప్రస్తావించారు.

దూల్‌పేటపై ప్రశ్నించిన రాజాసింగ్
దూల్‌పేట పునరావాస సౌకర్యాల గురించి రాజాసింగ్ అడిగారు. స్పీకర్ ద్వారా తాను ముఖ్యమంత్రికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని, మీరు (కేసీఆర్) ఇదే అసెంబ్లీ సాక్షిగా గతంలో మాట్లాడుతూ తాను దూల్‌పేటకు వస్తానని, ప్రజలను ఆదుకుంటానని చెప్పారని, కానీ ఈ రోజుకు కూడా దూల్‌పేట ప్రజలు మీ వైపు చూస్తున్నారని, ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మమ్మల్ని ఆదుకుంటారని చూస్తున్నారని అన్నారు.

వారికి ఉపాధి ఏది?
మీరు రూ.2 లక్షల చొప్పున డబ్బులు ఇచ్చి పునరావాస సౌకర్యాలు పూర్తయ్యాయని చెబితే పూర్తి కాదని రాజాసింగ్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా వాళ్లు గుడుంబా తయారు చేసి బతికారని, కానీ హఠాత్తుగా బంద్ చేశారని, అలా చేసిన తర్వాత వారికి సరైన ఉపాధి లేదని చెప్పారు. మనం వారికి సరైన పునరావాస సౌకర్యాలు కల్పించలేదన్నారు.

సీఎం మాకే సమయం ఇవ్వరని అంటున్నారు
ఈ విషయమై తాము ఎన్నోసార్లు ఎక్సైజ్ శాఖ మంత్రికి చెప్పామని, దానికి సదరు మంత్రి మాట్లాడుతూ.. మా ముఖ్యమంత్రి మాకే సమయం ఇవ్వడం లేదు, మీకు ఎప్పుడు ఇస్తారనే చర్చ జరిగిందని రాజ్‌సింగ్ అన్నారు. ఈ రోజు నేను దూల్‌పేటలో ఉంటున్నానని, నేను దూల్‌పేట ప్రజలకు అండగా ఉంటానని, వాళ్ల బాధలు నేను చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను స్కూల్స్‌కు పంపించాలన్నా కూడా వారి వద్ద డబ్బులు లేవన్నారు. అలాంటి వారిని ఎవరు ఆదుకోవాలన్నారు. సీఎంకు బాధ్యత లేదా అన్నారు.

రాజాసింగ్‌కు కేసీఆర్ థ్యాంక్స్
తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని, దూల్‌పేట గుడుంబా బంద్ చేశారని, కానీ వారి పునరావాసం గురించి ఎందుకు ఆలోచించలేదని రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు. దూల్‌పేట అంశంపై రాజాసింగ్ మాట్లాడుతుండగా... కేసీఆర్ దానిని నోట్ చేసుకున్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ విషయంలో నేను ఫెయిల్ అయ్యానని, ఈ అంశాన్ని గుర్తు చేసినందుకు రాజాసింగ్‌కు థ్యాంక్స్ అన్నారు.

దూల్‌పేట అభివృద్ధిపై రాజాసింగ్ దృష్టి
దూల్‌పేట ప్రజలు ఏళ్లుగా గుడుంబా తయారు చేసి బతుకు వెళ్లదీసేవారు. వారి బతుకులు మార్చుతామని ఎంతోమంది నేతలు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చెప్పింది. తాము అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకుంటామని 2014 ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు రాజాసింగ్ దానిపై ప్రశ్నించడంతో కేసీఆర్ పెయిలయినట్లు అంగీకరించారు. వారికి పునరావాసం కల్పిస్తానని చెప్పారు. దూల్‌పేట అభివృద్ధిపై రాజాసింగ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications