వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీవో 111 ఎత్తివేస్తామన్న సీఎం కేసీఆర్; పర్యావరణ వేత్తల ఆందోళన; మ్యాటర్ ఏంటంటే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా జీవో 111 ఎత్తివేస్తామని చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు జీవో 111 ను ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో నగర వాతావరణంలో పెను మార్పులు సంభవించే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ జీవో111 ఏంటి? ఈ జీవోను ఎత్తివేయాలని కేసీఆర్ నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ.

ఆ జలాశయాల పరిరక్షణ కోసం జీవో 111

ఆ జలాశయాల పరిరక్షణ కోసం జీవో 111


జీవో 111 హైదరాబాద్ నగరానికి వరద ముప్పు తప్పించడంతో పాటుగా తాగునీటిని అందించడం కోసం నిజాం కాలంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. తాగునీటి జలాశయాలుగా ఈ జలాశయాలు హైదరాబాద్ వాసుల తాగునీటి అవసరాలను తీర్చాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి ఈ రెండు జలాశయాల నీళ్లు వాడుకోవాల్సి న అవసరం లేదు. ఎండాకాలంలో బాగా నీళ్ల సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే ఈ జలాశయాల నుండి నీళ్లు వాడుకుంటున్నారు.

7 మండలాల్లోని, 83గ్రామాల్లో జీవో 111 ఆంక్షలు

7 మండలాల్లోని, 83గ్రామాల్లో జీవో 111 ఆంక్షలు

ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం జీవో 111 ను తీసుకువచ్చారు. ఈ రెండు జలాశయాల పరిరక్షణ జీవో పరిధిలో సుమారు ఒక లక్ష 32 వేల 600 ఎకరాల భూమి ఉంది. ఏడు మండలాలు, 83 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్, కొత్తూరు మండలాలలోని 83 గ్రామాలలో ఈ జీవో అమలులో ఉంది. ఈ జీవో ప్రకారం కాలుష్య కారక మైన ఫ్యాక్టరీలు, నిర్మాణాలు, లేఅవుట్లు, వెంచర్లు అక్కడ చేయకుండా నిబంధనలు ఉన్నాయి.

వ్యవసాయం తప్ప అక్కడ ఏ రంగానికి కూడా భూమిని కేటాయించకుండా నిబంధనలు

వ్యవసాయం తప్ప అక్కడ ఏ రంగానికి కూడా భూమిని కేటాయించకుండా నిబంధనలు

వ్యవసాయం తప్ప అక్కడ ఏ రంగానికి కూడా భూమిని కేటాయించడానికి వీలులేకుండా జీవో ఉంది . జలాశయాలలో రసాయనాలు, క్రిమిసంహారక స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీ తో పర్యవేక్షించాలని, జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో జి ప్లస్ టు నిర్మాణాలకు మించి చేయడానికి వీల్లేదని జీవోలో స్పష్టంగా ఉంది. అంతేకాదు క్యాచ్మెంట్ పరిధిలో వేసే లేఅవుట్లలో 60 శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలని అక్కడ వినియోగించే భూమిలో 90 శాతం కన్సర్వేషన్ కోసం కేటాయించాలని పేర్కొంది.

సీఎం కేసీఆర్ ఆంక్షల ఎత్తివేత నిర్ణయంతో పర్యావరణ వేత్తల ఆందోళన

సీఎం కేసీఆర్ ఆంక్షల ఎత్తివేత నిర్ణయంతో పర్యావరణ వేత్తల ఆందోళన

1996లో తీసుకువచ్చిన ఈ 111 జీవోతో రెండు జలాశయాల చుట్టూ ఉన్న ప్రాంతాలలో ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆంక్షలు ఉన్న గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే, పర్యావరణ వేత్తలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ మహా నగరంతో ముడిపడిన జీవవైవిద్యం, పర్యావరణ సమతుల్య ప్రాంతం ఈ రెండు జలాశయాల పరిధిలోనే ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ జీవో రద్దు చేస్తామని చెప్పి తీసుకున్న నిర్ణయంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది అని వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

పర్యావరణాన్ని, భవిష్యత్ తరాల ప్రయోజనాన్ని పణంగా పెట్టడం మంచిది కాదని హితవు

పర్యావరణాన్ని, భవిష్యత్ తరాల ప్రయోజనాన్ని పణంగా పెట్టడం మంచిది కాదని హితవు

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పట్టణీకరణ పెను సమస్యగా ఉంది. ఈ క్రమంలో కెసిఆర్ నిర్ణయంతో ఆ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతుందని, జలాశయాల పరిధి కూడా కాంక్రీట్ జంగిల్ గా మారుతుందని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల కోసం, రియల్ ఎస్టేట్ వ్యవస్థల లాబీయింగ్ కోసం పర్యావరణాన్ని, భవిష్యత్ తరాల ప్రయోజనాన్ని పణంగా పెట్టడం సరికాదని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. హుస్సేన్ సాగర్ విషయంలో జరిగిన తప్పు మళ్లీ జంట జలాశయాల విషయంలో జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని, వాటి అవసరం తీరిపోయిందని భావించడం మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

English summary
The decision of CM KCR to cancel G.O.111 for conservation of Usman Sagar and Himayat Sagar twin reservoirs has caused concern among environmentalists. What is the G.O. 111 is currently under discussion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X