ఉద్యోగులకు వరాలు, ఎన్నికల వ్యూహాలు - సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు, నేడే..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తున్నారు. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు అన్ని వర్గాలను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా పలు ప్రకటనలకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టేలా నిర్ణయాలకు ప్రభుత్వం సిద్దం అవుతోంది.
ఎన్నికల వ్యూహాలు:
తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. వరుస నిర్ణయాలతో అందరినీ ఆకట్టుకొనేలా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు జరగనున్న కేబినెట్ సమావేశం పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేచనుంది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్) చుట్టూ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఈ భేటీలో 'మెట్రో' ప్రతిపాదనలపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపే అవకాశముంది. వీటితో పాటు మొత్తం 22 అంశాలతో కూడిన ఎజెండాపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేసిన నాలుగు టిమ్స్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించే తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-2022 బిల్లును కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది.
ఉద్యోగులకు వరాలు:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటు, ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ, వర్షాలు, వరదలతో జరిగిన నష్టం, సహాయ..పునరుద్ధరణ చర్యలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఆసరా పింఛన్ల పెంపు తదితర అంశాలపై కూడా సోమవారం జరగనున్న మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సింగరేణి కాలరీస్ సంస్థకు బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో వెయ్యి చదరపు గజాల ప్రభుత్వ భూమిని మార్కెట్ ధరకు విక్రయించే ప్రతిపాదనను కూడా కేబినెట్ ఎజెండాలో చేర్చారు.విద్యుత్ కొనుగోళ్ల బకాయిల చెల్లింపు, ట్రాన్స్‌మిషన్ చార్జీల చెల్లింపునకు గాను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ), బ్యాంకుల నుంచి ట్రాన్స్‌కో సేకరించనున్న రూ.5 వేల కోట్ల రుణాలకు పూచీకత్తుపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

అసెంబ్లీ సమావేశాల వేదికగా:బుద్వేల్‌లో ఉన్న దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెచ్‌ఎండీఏ ద్వారా వేలం వేసే ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన నాలుగు బిల్లులపై పలు వివరణలను కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని ప్రభుత్వానికి తిప్పి పంపారు.
గవర్నర్ అడిగిన వివరణలకు సమాధానమిచ్చే విధంగా ఈ బిల్లుల్లో మార్పులు చేస్తూ రూపొందించిన ముసాయిదాలపై చర్చించే ప్రతిపాదనను కేబినెట్ ఎజెండాలో చేర్చారు. ఆగస్టు 3 నుంచి చేపట్టే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications