KCR: అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో కేసీఆర్ సభలు..

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. ఓ పక్క సీఎం కేసీఆర్.. మరో పక్క హరీశ్ రావు, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని పూర్తి చేశారు. మధ్యలో బతుకమ్మ, దసరా రావడంతో ప్రచారానికి కాస్త విరామం ప్రకటించిన కేసీఆర్ గురువారం నుంచి మళ్లి ప్రచారం మొదలు పెట్టనున్నారు. ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.

అక్టోబర్ 27 ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్, వర్ధన్న పేట సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. అయితే బీఆర్ఎస్ ప్రచార షెడ్యూల్ స్వల్ప మార్పులు చేసింది. 26న అచ్చంపేట, నాగర్ కర్నూలు, మునుగోడులో సభలకు ప్లాన్ చేశారు.. కానీ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో సభలు నిర్వహంచనున్నారు. నాగర్ కర్నూలుతో తర్వాత ప్రచారం చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్టోబర్ 15 బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించి అదే రోజు నుంచి ప్రచారం ప్రారంభించారు. కేసీఆర్ ఎప్పటికే హుస్నాబాద్‌, జనగామ, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్‌లో ప్రచారం నిర్వహించారు.

CM KCR will conduct campaign in Acchampeta, Vanaparthi, Munugodu

అయితే బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లడం లేదని పార్టీ అగ్రనేతల దృష్టికి వెళ్లింది. దీంతో బూత్ స్థాయిలో మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈసారి బీఆర్ఎస్ మేనిఫెస్టో రుణ మాఫీ లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారొచ్చని భావిస్తున్నారు. కాగా సీఎం కేసీఆర్ అక్టోబర్‌ 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, అక్టోబర్‌ 30న జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌, అక్టోబర్‌ 31న హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ, నవంబర్‌ 1న సత్తుపల్లి, ఇల్లెందులో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనున్నారు.

నవంబర్‌ 2న నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి, నవంబర్‌ 3న భైంసా, ఆర్మూర్‌, కోరుట్ల, నవంబర్‌ 5న కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్‌ 6న గద్వాల్‌, మఖ్తల్‌, నారాయణపేట, నవంబర్‌ 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, నవంబర్‌ 8న సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి ప్రచారంలో పాల్గొననున్నారు. కేసీఆర్ నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డ నుంచి నామినేషన్లు వేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+